వైద్యుల నిర్లక్ష్యం: బతికుండగానే బాలుడు చనిపోయాడని చెప్పిన డాక్టర్లు

Update: 2020-06-27 17:56 GMT
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ బాలుడు చనిపోక ముందే చనిపోయినట్లుగా చెప్పి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పంపించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే గర్భిణీ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే అబార్షన్ చేయాలని చెప్పిన డాక్టర్లు, కుటుంబ సభ్యుల అనుమతితో అబార్షన్ చేసి, ఇద్దరు పిల్లల్ని బయటకు తీశారు.

అయితే కవలలు ఇద్దరూ చనిపోయారని చెప్పి కవర్లో చుట్టి ఇచ్చారు. కానీ కవర్‌లోని ఓ బాలుడు కదలడంతో తండ్రి తిరిగి ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. డాక్టర్లు బాలుడికి చికిత్స చేశారు. అయితే అబార్షన్ తర్వాత బాలుడు ప్రాణాలతో ఉన్నాడో లేదో పరీక్షించకుండా చనిపోయారని చెప్పడంపై బంధువులు ఆగ్రహిస్తున్నారు. ఈ సంఘటన ఈ రోజు ఉదయం జరిగింది.

గర్భిణీని ఆసుపత్రికి తీసుకు రాగానే స్కానింగ్ చేసి కవలల్లో ఒకరు చనిపోయారని చెప్పిన వైద్యులు అబార్షన్ చేయాలని చెప్పారు. కానీ అబార్షన్ తర్వాత ఇద్దరు చనిపోయినట్లు కవర్‌లో చుట్టి ఇవ్వడం, ఆ తర్వాత ఓ బాబు బతికే ఉండటంతో వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తవుతోంది.
Tags:    

Similar News