నిజంగానే.. 15 బీర్లు తాగించి బతికించారు

Update: 2020-03-08 08:42 GMT
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి.. లాంటి సామెతలు వినే ఉంటారు. తాజాగా అలాంటి పనే చేశారు వియత్నాంకు చెందిన వైద్యులు. పూటుగా తాగేసిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వేళ.. అతన్ని బతికించేందుకు ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. కేన్ల కొద్దీ బీర్లను లాగించేసిన  గువన్ వాన్ నహత్ అనే వ్యక్తి  శరీరంలో ప్రమాదకర స్థాయిలో మిథనాల్ చేరుకుంది. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని వైద్యులు.. అతడికి వినూత్నంగా ట్రీట్ మెంట్ ఇచ్చారు.

అతడున్న పరిస్థితుల్లో ఏ రకంగా ట్రీట్ మెంట్ ఇచ్చిన బతికే అవకాశాలు తక్కువగా ఉండటంతో.. ప్రమాదకరమని తెలిసినా మరో మార్గం లేక ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని ఎంచుకున్నారు. పదిహేను కేన్ల బీరును నహత్ పొట్టలోకి పంప్ చేశారు. దీంతో.. బీరుతో విషతుల్యమైన అతని కడుపులోని విషాన్ని బీరుతోనే తీసే ప్లాన్ చేశారు.

బీర్ లో ఇథనాల్ తో పాటు మిథనాల్ కూడా ఉంటుంది. మిథనాల్ ద్వారా కడుపులో ఏర్పడే యాసిడ్ ను ఇథనాల్ నియంత్రిస్తుంది. దానిపై ఉన్న నమ్మకంతో ప్రయత్నం చేసిన వైద్యులు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. నహత్ బతికి బయటపడ్డారు. ఇప్పుడిది అద్భుతంగా మారింది.
Tags:    

Similar News