ఈటల గెలుపు లో కీలక పాత్ర ఎవరిదో తెలుసా ?

Update: 2021-11-03 16:30 GMT
హోరా హోరీ గా జరిగిన హజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక లో ఈటల రాజేందర్ గెలిచారు. అయితే ఆయన గెలుపు అంత ఈజీ గా రాలేదు. అధికార టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను డమ్మీ అభ్యర్దనే చెప్పాలి. ఈటల-గెల్లు మధ్య స్ట్రైట్ ఫైట్ అయితే ఈటల కు గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పాలి. కానీ ఇక్కడ గెల్లు ను ముందుపెట్టి వెనకంతా కథ నడిపింది కేసీఆర్ మాత్రమే. అంటే ఉప ఎన్నిక లో పోటీ కేసీఆర్-ఈటల మధ్యగా మారి పోయింది.

ఎలాగైనా గెలిచి కేసీఆర్ అహం కారానికి సమాధానం చెప్పాలని ఆత్మాభిమానం అంటే ఏమిటో తెలియ జేయాలని ఈటల గట్టి ప్రయత్నంచేశారు. ఇదే సమయం లో ఈటలను ఎలాగైనా ఓడించి తన పవర్ ఏమిటో చూపించాలని కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుకే ఈ ఎన్నిక ఇంత హోరా హోరీ గా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ ను రేపిన ఎన్నిక లో చివరకు ఈటల 23,865 ఓట్ల మెజారిటి తో గెలిచారు. ఈటల గెలుపు కు అనేక అంశాలు దోహదం చేశాయి.

ఈటల గెలుపుకు ఎన్ని అంశాలు సాయం చేసినా ప్రధాన మైన కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి. అవును కాంగ్రెస్ పార్టీ సాయం చేయక పోయుంటే ఫలితం ఎలా గుండేదో చెప్పలేరు. మొదటి నుండి ఇక్కడ పోటీ ఈటల-కేసీఆర్ మధ్య మాత్రమే అనే ప్రచారం బల పడిపోయింది. అందుకనే కాంగ్రెస్ వెనక బడిపోయింది. అందుకనే కాంగ్రెస్ ను జనాలే కాదు చివరకు హస్తం పార్టీ సీనియర్ నేతలే పట్టించుకోలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కాంగ్రెస్ కు ఓట్లు పెరిగే కొద్దీ ఈటల, టీఆర్ఎస్ లో ఎవరో ఒకరికి దెబ్బపడటం ఖాయం.

ఇక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకం గా వ్యవహరించింది. శతృవు కి శతృవు అనే నానుడిని నిజం చేసింది. ఈటల, కాంగ్రెస్ ఇద్దరికీ కేసీఆర్ ప్రధమ శతృవు. అందుకనే ఉపఎన్నిక లో తెరవెనుక నుండి ఈటల గెలుపు కు సాయం చేసింది. ఇందు లో భాగంగా నే అభ్యర్ధి ఎంపిక ను బాగా ఆలస్యం చేసింది. చివర కు బాగా వీక్ గా ఉండే అభ్యర్ధిని ఎంపిక చేసింది. తమ అభ్యర్ది గెలుపుకు సీనియర్ల లో చాలా మంది ప్రచారాని కే రాలేదు. ఏ ఎన్నిక లో కూడా కాంగ్రెస్ కు 30 వేల ఓట్లు ఖాయం గా పడతాయి.

అలాంటిది ఇఫుడు వచ్చిన ఓట్లు 2 వేలు మాత్రమే. ఇక్కడే సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకమయ్యాయి. ఓటమి పై ఆయన స్పందిస్తు శతృవుకు శతృవున్న రాజకీయ వ్యూహాన్ని తాము పాటించాల్సొచ్చిందన్నారు. అంటే తమ అభ్యర్ధిని దెబ్బకొట్టుకుని ఈటల గెలుపుకు కాంగ్రెస్ సాయం చేసినట్లు అర్ధమవుతోంది. కాంగ్రెస్ సాయం లేకపోతే ఎలాగుండేదో తెలీదుకానీ పరోక్ష సహకారం వల్లే ఈటల గెలుపు ఈజీ అయ్యిందని మాత్రం అర్ధమైపోతోంది.



Tags:    

Similar News