ప్రపంచానికి కొత్త వణుకుగా మారిన ఒమిక్రాన్ వేరియంట్.. కాస్త ఆలస్యంగానే భారత్ లో అడుగు పెట్టటం తెలిసిందే. ఇప్పటికే వేలాది కేసులు పలు దేశాల్లో నమోదు కావటం తెలిసిందే. ఈ దారుణ వేరియంట్ బారి నుంచి తప్పించుకునేందుకు దేశ వ్యాప్తంగా పలు చర్యలు తీసుకున్నప్పటికి.. విదేశాల నుంచి వచ్చే వారి కారణంగా కొత్త వేరియంట్ తిప్పలు తప్పట్లేదు. ఇదిలా ఉంటే.. క్యాలెండర్ లో రోజులు గడుస్తున్న కొద్దీ.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఇప్పటివరకు తెర మీదకు వచ్చిన కేసులకు భిన్నంగా ఏడేళ్ల చిన్నారికి పాజిటివ్ అయిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్ గా చెబుతున్నారు. దీంతో.. ఆ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఈ బాలుడు.. తన తల్లిదండ్రులతో పాటు అబుదాబి నుంచి డిసెంబరు 10న హైదరాబాద్ మీదుగా బెంగాల్ కు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేకరించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ కావటం.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఒమిక్రాన్ వేరియంట్ గా గుర్తించారు. అయితే.. పిల్లాడి తల్లిదండ్రులకు ఈ వేరియంట్ సోకలేదని.. వారికి పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఆ బాలుడ్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చి.. ప్రత్యేక వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం తెలిసిందే. ఈ ఇద్దరు విదేశా లనుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులే కావటం గమనార్హం. తాజాగా నమోదైన కేసులతో కలిపి.. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు 40కు పైనే నమోదైనట్లుగా చెబుతున్నారు. గాలి ద్వారా సోకే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.