భార్య‌ను ప‌బ్లిక్ గా బెదిరించిన ట్రంప్‌

Update: 2017-01-26 09:12 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచ‌ల‌నంగా మారుతోంది. ఇంకా క‌రెక్టుగా చెప్పాలంటే సంచ‌ల‌నం అయ్యేలాగే ఆయ‌న చేస్తున్నాన్న‌ట్లుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ‌స్వీకారం చేసే స‌మ‌యంలో ఆయ‌న భార్య మెలానియా హావ‌భావాల ఫొటోల‌ను పోస్ట్ చేసి విమ‌ర్శ‌కులు - స్త్రీవాదులు ట్రంప్‌ ను వాయించేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఫొటోల ప్ర‌కారం ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో ఒక ఫొటోలో న‌వ్వుతూ క‌నిపించిన మెలానియా.. కాసేప‌టికే ముభావంగా క‌నిపించారు. ఇందుకు కార‌ణం ట్రంప్ ఆమెను బెదిరించ‌డ‌మేన‌ని అంటున్నారు.

ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా న‌వ్వుతూ ఉన్న మెలానియాను వెన‌క్కి తిరిగి ట్రంప్ ఏదో అన‌డంతో ఆ వెంట‌నే ఆమె సీరియ‌స్‌ గా మొహం పెట్టుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది. అదెంత వ‌ర‌కు వెళ్లిందంటే.. ట్రంప్ నుంచి మెలానియాకు విముక్తి క‌ల్పించండి అన్న ప్ర‌చారం అమెరికాలో మొద‌లైంది. అస‌లే ట్రంప్ అంటే ప‌డ‌నివాళ్లు ఇప్ప‌టికీ ఆందోళ‌న‌లు చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లు ఈ వీడియోని చూపిస్తూ మెలానియాపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ వీడియోతోపాటు ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా కొన్ని ఫొటోల‌ను కూడా షేర్ చేస్తూ ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు. మాజీ ఫ‌స్ట్ లేడీ మిషెల్ ఒబామాకు మెలానియా ఓ గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని కూడా నెటిజ‌న్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటూ.. ఆ బాక్స్‌లో మెలానియా హెల్ప్ అని రాసిన‌ట్లుగా ఓ పోస్ట్ చేశారు. ఇప్పుడు ట్విట్ట‌ర్‌ లో ఫ్రీమెలానియా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ తాజా వీడియోను మ‌ర్వ్ వీన్ అనే వ్య‌క్తి జ‌న‌వ‌రి 24న పోస్ట్ చేశారు. ఈ మూడు రోజుల్లోనే ఈ పోస్ట్‌కు 65 వేల‌కుపైగా లైక్స్‌.. 50 వేల‌కుపైగా రీట్వీట్స్ రావ‌డం విశేషం.  మొత్తంగా ట్రంప్ అంటే మ‌హిళ‌ల వ్య‌తిరేకి అనేది భార్య విష‌యంలోనూ తేలిపోయింది.

ఇదిలాఉండ‌గా.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడికి ఎప్పుడూ లభించని అతి తక్కువ ‘ఆమోదం’ రేటింగ్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభించింది. అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి మూడు రోజుల్లో ట్రంప్ రేటింగ్ విషయంలో అమెరికన్లు రెండుగా విడిపోయారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత శుక్రవారం నుంచి ఆదివారం వరకు ట్రంప్ పనిచేసిన తీరుపై సర్వే నిర్వహించారు. కేవలం 45శాతం మంది మాత్రమే మొదటి వారాంతపు పనితీరుకు ఆమోదం తెలిపారు. ఇంత తక్కువ రేటింగ్ వచ్చిన అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే.

ఇంతకు ముందున్న అధ్యక్షుల్లో బరాక్ ఒబామా 2009లో మొదటి మూడు రోజుల్లో 67శాతం, 2001లో జార్జిబుష్ 57శాతం, 1993లో బిల్ క్లింటన్ 58శాతం, 1989లో సీనియర్ బుష్ 51శాతం, 1981లో రొనాల్డ్ రీగన్ 66శాతం, 1969లో రిచర్డ్ నిక్సన్ 59శాతం, 1961లో జాన్ కెన్నడీ 72శాతం, 1953లో ఐషన్ హోవర్ 68శాతం ప్రజల మద్దతును సంపాదించారు. మూడు రోజులపాటు రోజుకు 500మంది చొప్పున అమెరికన్లను ట్రంప్ పరిపాలనపై సర్వే చేశారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News