అమెరికా జ‌ర్న‌లిస్టుల‌కు దేశ‌భ‌క్తి లేదా?

Update: 2018-07-31 04:54 GMT
నోరు పారేసుకోవ‌టంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌ర్వాతే ఎవ‌రైనా. మూర్తీభ‌వించిన తెంప‌రిత‌నంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం.. న‌చ్చ‌ని వారిపై నింద‌లు వేయ‌టం ట్రంప్ కు మామూలే. తాజాగా త‌న నోటికి మ‌రింత పని పెట్టారు. త‌న‌ను నిశితంగా ప‌రిశీలిస్తూ.. చీల్చి చెండాడే అమెరికా మీడియా మీద ట్రంప్ కున్న ఆగ్ర‌హం అంతా ఇంతా కాదు. అవ‌కాశం చిక్కిన ప్ర‌తిసారీ.. అమెరిక‌న్ మీడియా మీదా.. ఆ దేశ మీడియా సంస్థ‌ల‌పై విరుచుకుప‌డే ఆయ‌న‌.. తాజాగా భారీ విమ‌ర్శ‌ను సంధించారు.

త‌న నిర్ణ‌యాల్ని విమ‌ర్శిస్తున్నార‌న్న అక్క‌సుతో ఉన్న ట్రంప్‌.. అమెరిక‌న్ జ‌ర్న‌లిస్టుల‌పై తీవ్ర ఆరోప‌ణ చేశారు. ప్ర‌భుత్వ అంత‌ర్గ‌త విష‌యాల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తే.. జ‌ర్న‌లిస్టులే కాక ఎంతో మంది జీవితాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌న్న హెచ్చ‌రిక‌ను చేసిన ఆయ‌న‌.. బాధ్య‌తాయుత‌మైన‌.. క‌చ్ఛిత‌త్వంతో కూడిన వార్త‌తోనే ప్ర‌తికాస్వేచ్ఛ కు అర్థం ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

త‌న పాల‌న‌లోని త‌ప్పుల్ని నిత్యం ఎత్తి చూపించే అమెరికా జ‌ర్న‌లిస్టుల మీద త‌న‌కున్న అక్క‌సు మొత్తాన్ని ఒక్క‌మాట‌లో తేల్చేలా ఆయ‌న ఒక ఆరోప‌ణ‌స్త్రాన్ని సంధించారు. అమెరికా జ‌ర్న‌లిస్టుల‌కు దేశ‌భ‌క్తి లేద‌న్న ఆయ‌న‌.. వార్త‌లు రాసే విష‌యంలో క‌చ్ఛిత‌త్వాన్ని స‌రి చూసుకోవాలంటున్నారు. మొత్తంగా చూస్తే.. త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా రాయాల‌న్న రీతిలో ట్రంప్ మాట‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. త‌న‌కు మేలు చేసేలా కంటే కూడా.. త‌న‌ను ఇబ్బంది పెట్టేలా రాయ‌కుంటే చాల‌న్న‌ట్లుగా ట్రంప్ మాట‌లు ఉన్న‌ట్లుగా మ‌రికొంద‌రు అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News