అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన అనంతరం ప్రజలనుద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ప్రచారంలో కనిపించిన ట్రంప్ కి ఒక్కసారి అధ్యక్షుడిగా మారిన అనంతరం ట్రంప్ కి పూర్తి వ్యత్యాసం ఆయన ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చిన ట్రంప్.. గెలుపు అనంతరం పెద్దమనిషి తరహాతో పాటు అత్యంత సౌమ్యంగా ప్రసంగించడం ఇక్కడ గమనార్హం.
ఈ సందర్భంగా... గెలుపోటములను పక్కన పెట్టి అందరూ అమెరికా అభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన అనంతరం ఆయన న్యూయార్క్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశానికి - ప్రచారంలో తనకు సహాయ సహకారాలు అందించిన సన్నిహితులు - స్నేహితులు - కుటుంబసభ్యులకు పేరుపేరునా ఈ సందర్భంగా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్... దేశానికి సేవ చేసేందుకు అవకాశమిచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అమెరికా అంటే బెస్ట్.. అంతకంటే తక్కువదాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని, ఏ అంశంలోనైనా అమెరికా ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే... ఇది ఒక్కటే చారిత్రక విజయం కాదని, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నయాని, ముందు ముందు చూస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
ఫలితాల అనంతరం హిల్లరీ క్లింటన్ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని చెప్పిన ట్రంప్... తాను కూడా హిల్లరీని అభినందించానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ఇద్దరం హోరాహోరీ తలపడ్డామని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/