అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు ఇన్నాళ్లు పలు ప్రపంచాధినేతలను, పౌరులను ఆఖరికి అమెరిక్లను కూడా చిక్కుల్లో పడేశాయి. అయితే తాజాగా ట్రంప్ దుందుడుకు వైఖరి ఆయనకే చుక్కలు చూపిస్తోంది. తన సొంత ఫోన్ నెంబరు ఇవ్వడం గొప్పగా భావించిన ట్రంప్ ఇప్పుడు ఆ నిర్ణయం కారణంగానే ఇక్కట్లలో పడ్డారు. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ట్రంప్....కెనడా - మెక్సికో - ఫ్రాన్స్ అధ్యక్షులకు ట్రంప్ తన వ్యక్తిగత ఫోన్ నెంబరు ఇచ్చారు. అంతేగాక, ఎప్పుడైనా తనకు ఫోన్ చెయ్యవచ్చని, నేరుగా తనతో మాట్లాడమంటూ వారికి చెప్పారు.
ఇటీవల జరిగిన ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మానుయేల్ మాక్రాన్ ఎన్నిక సమయంలో కూడా ట్రంప్ నేరుగా ఆయనకు ఫోన్ చేసి తన సొంత నెంబర్ ఇచ్చారు. కాగా, ప్రొటోకాల్ ను పక్కన పెట్టి నేరుగా ట్రంప్ నకు ఫోన్లు రావడం మంచిది కాదని భద్రతా అధికారులు భావిస్తున్నారు. పర్సనల్ నెంబర్ ఇవ్వడం ప్రమాదకరమని పేర్కొంటూ ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా నేరుగా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఫోన్ ను గూఢచారులు హ్యాక్ చేసే ప్రమాదముందని అంటున్నారని తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక విషయాలను ఫోన్ లో సంభాషించినప్పుడు అవి బయటికి పొక్కే ప్రమాదం ఉందని చెప్పారు. దీంతోపాటుగా ట్రంప్ ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్లు లేని సాదాసీదా ఫోన్ వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/