అధికార పగ్గాలు చేపట్టింది మొదలుకొని రోజుకో ప్రకటనతో రచ్చ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా వలసలపై కన్నెర్ర చేశారు. గతంలో ప్రకటించినట్లుగానే ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా హెచ్చరికలు జారీ చేశారు. 'ఇప్పటి వరకు తేలికగా అమెరికాలో అడుగుపెట్టారు. ఇక నుంచి అమెరికాలో అడుగుపెట్టాలంటే చాలా చాలా కష్టం' అని ట్రంప్ తాజాగా తేల్చిచెప్పారు. ఇందులో భాగంగానే మొత్తం ఏడు దేశాలకు చెందిన ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టకుండా ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
అత్యంత ఆశ్చర్యకరంగా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ పేరు ఇందులో లేదు. పాక్ తో పాటుగా అఫ్ఘనిస్థాన్ - సౌదీ అరేబియా దేశాలు మాత్రం ఆయన నిషేధించిన దేశాల జాబితాలో లేవు. దీనిపై ట్రంప్ వివరణ ఇచ్చారు. ఈ దేశాలకు చెందిన ముస్లింలను అనుమతి ఇస్తామని, ముస్లింలందరినీ బ్యాన్ చేయడం ఉద్దేశం కాదని, టెర్రరిజం ప్రభావం ఉండే దేశాలకు చెందిన వారి విషయంలో నిషేధాజ్ఞలు ఉంటాయని చెప్పారు. ముస్లిం తీవ్రవాద దేశాలకు చెందిన వారు అమెరికాలో ఇక అడుగుపెట్టలేరని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/