ట్రంప్ సిబ్బందిని ప‌క్క‌కు నెట్టి పారేశారు!

Update: 2019-07-01 05:29 GMT
అమెరికా అధ్య‌క్షుడు ఏదైనా దేశానికి వెళితే సీన్ ఎలా ఉంటుంది?  ఏదో దేశం సంగ‌తి ఎందుకు? మ‌న దేశానికి వ‌చ్చిన సంద‌ర్భంలో అమెరికా నిఘా విభాగం చేసే ఓవ‌రాక్ష‌న్ అలా ఇలా ఉండ‌దు. ఒక రోజు ముందే.. త‌మ అధ్య‌క్షుల వారు ఉండే ప్రాంతాన్ని వారి స్వాధీనంలోకి తీసేసుకుంటారు. మ‌నోళ్ల‌ను ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌రు. వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తే క‌న్నెర్ర చేస్తారు. అధ్య‌క్షుల వారు వ‌చ్చే రోజు ముందు నుంచి వారి అడ్డాలో మ‌నం ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు.

ఇలాంటివ‌న్నీ మ‌న ద‌గ్గ‌రేనా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌య్యే ఉదంతంగా తాజా పరిణామాన్ని చెప్పాలి. అమెరికా చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ అమెరికా అధ్య‌క్షుల వారు చేయ‌ని రీతిలో ఉత్త‌ర‌కొరియాకు ట్రంప్ వెళ్ల‌టం.. అక్క‌డ ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జోంగ్ నుక‌ల‌వ‌టం.. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ ప‌రిణామం ఇప్పుడో హాట్ న్యూస్ గా మారింది.

కిమ్ అడ్డాలోకి అమెరికా అధ్య‌క్షుడు వెళ్ల‌టం మామూలు సాహ‌సం కాదంటూ ట్రంప్ ను కీర్తిస్తున్నారు. ఇదంతా స‌రే కానీ.. ట్రంప్ అడుగు పెట్ట‌టానికి ముందు అమెరికా నిఘా విభాగం.. భ‌ద్ర‌తా సిబ్బంది స‌ద‌రు స్థ‌లాన్ని స్వాధీనం వ‌గైరా.. లాంటివేమీ చోటు చేసుకోలేద‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. కిమ్ తో ట్రంప్ క‌ర‌చాల‌నం చేసుకునే స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుల వారి సిబ్బందిపైన కిమ్ భ‌ద్ర‌తా సిబ్బంది ఆరాచ‌కం అన్న రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ట‌. కిమ్ కు  ట్రంప్ షేక్ హ్యాండ్  ఇచ్చే స‌మ‌యంలో ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడికి ద‌గ్గ‌ర‌గా వెళ్లేందుకు వైట్ హౌస్ నూత‌న ప్రెస్ సెక్ర‌ట‌రీ స్టెఫానీ గ్రెష‌మ్ ప్ర‌య‌త్నించ‌గా.. కిమ్ భ‌ద్ర‌తా సిబ్బంది ఆమెను ప‌క్క‌కు లాగి పారేశార‌ట‌. స్టెఫానీతో పాటు.. మిగిలిన మీడియా సిబ్బందికి ఇలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంద‌ట‌.

ఈ ఉదంతంలో స్టెఫానీ స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు కిమ్-ట్రంప్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్లో కూర్చునేందుకు సైతం ఆమె కొంద‌రు ఉత్త‌ర‌కొరియాకు చెందిన వారితో ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా స్టెఫానీ గాయ‌ప‌డిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇరువురు దేశాధ్య‌క్షుల స‌మావేశాన్ని ఒక భ‌వ‌నంలో నిర్వ‌హించాల‌ని భావించినా.. చివ‌ర‌కు అది సాధ్యం కాక‌.. బ‌య‌ట ప్ర‌దేశంలోనే స‌మావేశం కావ‌టం గ‌మ‌నార్హం. మ‌న దేశానికి వ‌చ్చిన‌ప్పుడు హ‌డావుడి చేసే పెద్ద‌న్న సిబ్బందికి కిమ్ అడ్డాలో మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంత పెద్ద అమెరికా అధ్య‌క్షుడి సిబ్బందిని కిమ్ బ్యాచ్ పూచిక పుల్ల మాదిరి తీసి పారేసిందే!
Tags:    

Similar News