ట్రంప్.. కిమ్ భేటీ ప్లేస్ ప్ర‌త్యేక‌త ఇదేన‌ట‌!

Update: 2019-07-01 05:37 GMT
చ‌రిత్ర‌లో తొలిసారి అమెరికా అధ్య‌క్షుడు ఒకరు ఉత్త‌ర కొరియా గ‌డ్డ మీద కాలు మోప‌ట‌మే కాదు.. ఆ దేశాధ్య‌క్షుడితో చ‌ర్చ‌లు జ‌రిపిన వైనం ప్ర‌పంచం వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇరు దేశాల అధినేత‌లు చ‌ర్చ జ‌రిపిన ప్రాంతం మీద ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. నిస్సైనిక ప్రాంతంగా పేరున్న ఈ ప్రాంతం ఎక్క‌డ ఉంది?  దాని ప్ర‌త్యేక‌త ఏమిటన్న దానిపైన అంద‌రిలో ఉత్సుక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

పేరులో నిస్సైనిక (సైనికులు అంటూ ఉండ‌ని) ప్రాంతంగా చెప్పిన‌ప్ప‌టికీ వాస్త‌వం మాత్రం అందుకు భిన్న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ప్రాంతంలో 20 ల‌క్ష‌ల మందుపాత‌ర‌లు.. ట్యాంక్ ట్రాప్ లు.. రేజ‌ర్ వైర్ కంచెలు.. గార్డ్ శిబిరాలు పెద్ద ఎత్తున ఉంటారు. నిత్యం వేలాది మంది సైనికులు పోరాటానికి అనుక్ష‌ణం సిద్ధంగా ఉంటారు. అంతేకాదు.. ఇరువైపుల త‌ర‌చూ ఉద్రిక్త ప‌రిస్థితులు ఉంటాయి. ఉత్త‌ర‌.. ద‌క్షిణ కొరియాల మ‌ధ్య స‌రిహ‌ద్దుగా చెప్పే ఈ ప్రాంతంలో గ‌డిచిన కొన్ని నెల‌లుగా కాస్తంత ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ ప్రాంతం నుంచే ఉత్త‌ర కొరియాకు చెందిన ప‌లువురు ప్రాణాల‌కు తెగించి మ‌రీ ద‌క్షిణ కొరియాలోకి అడుగు పెట్టేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తుంటారు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లువురు అమెరికా అధ్యక్షులు.. టాప్ అమెరిక‌న్ అధికారులు త‌ర‌చూ ఈ నిస్సైనిక ప్రాంతంలో ప‌ర్య‌టిస్తుంటారు. దీని ద్వారా త‌మ మిత్రుడైన ద‌క్షిణ కొరియాకు తాము అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నామ‌ని.. ద‌క్షిణ కొరియా త‌మ‌కు ఎంత మంచి మిత్రుడ‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చేసేందుకు త‌ర‌చూ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తుంటారు. ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా.. ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడితో భేటీ కావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

నిస్సైనిక ప్రాంతం కొరియ‌న్ ద్వీప‌క‌ల్పం గుండా సాగుతుంది. 248 కిలోమీట‌ర్ల వెడ‌ల్పు.. నాలుగు కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో  ఉంటుంది. 1950-53మ‌ధ్య కాలంలో ఇరు కొరియాల మ‌ధ్య జ‌రిగిన యుద్ధం త‌ర్వాత ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. త‌ర‌చూ ఎక్కువ హింస జ‌రిగే ప్రాంతంగా దీనికి పేరుంది. ఇలాంటి చోట అడుగు పెట్టిన ట్రంప్.. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ తో భేటీ అయ్యారు. కులాసాగా క‌బుర్లు చెప్పారు.

నిస్సైనిక  ప్రాంతంలో పాన్ ముంజోమ్ గ్రామం చాలా కీల‌క‌మైన‌దిగా చెబుతారు. ఉత్త‌ర కొరియా రాజ‌ధాని సియోల్ కు 52 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే ఈ గ్రామంలోనే అమెరికా అధ్య‌క్షులు త‌ర‌చూ ప‌ర్య‌టిస్తుండేవారు. ఒక అంచ‌నా ప్ర‌కారం పాన్ ముంజోమ్ గ్రామంలోని కాన్ఫెరెన్స్ హాలుల్లో దాదాపుగా 800 పైగా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లుగా చెబుతారు.

అంతేకాదు.. ఉత్త‌ర‌.. ద‌క్షిణ కొరియాల అధ్య‌క్షుల మ‌ధ్య తొలి శిఖ‌రాగ్ర స‌మావేశం ఇక్క‌డే జ‌రిగింది. గ‌తంతో పోలిస్తే.. ఇప్పుడు రెండు కొరియా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గాయి. తాజాగా ట్రంప్ భేటీ త‌ర్వాత కీల‌క మార్పులు చోటు చేసుకుంటాయా?  లేదా?  అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News