ఇండియా మీద.. ఇండియన్స్ మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంతో అమెరికన్లలో మంచి పాపులారిటీ సంపాదించి.. ఓ దశలో అధ్యక్ష పదవి రేసులో దూసుకెళ్లిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ చెత్త వ్యవహారాలతో భ్రష్టు పట్టిపోతున్నాడు. ఇప్పటికే అతడి గురించి అనేక నెగెటివ్ స్టోరీలు బయటికి వచ్చాయి. తాజాగా ట్రంప్ ఓ మాఫియా డాన్ తో కలిసి వ్యవహారాలు నడిపిన వైనం వెలుగులోకి వచ్చింది.
జెనోవెస్ నేర సామ్రాజ్యం అధినేత అయిన ఫ్యాట్ టోనీతో ట్రంప్ కు సంబంధాలున్నట్టు తాజాగా తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్.. ఫ్యాట్ టోనీకి చెందిన కంపెనీలతో కలిసి ట్రంప్ టవర్ - ట్రంప్ ప్లాజా నిర్మించడానికి రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రముఖ జర్నలిస్టు డేవిడ్ కే జాన్ స్టన్ వెల్లడించారు. పులిట్జర్ అవార్డు గ్రహీత అయిన జాన్ స్టన్ ఓ పత్రికలో ట్రంప్-ఫ్యాట్ టోనీతో సంబంధాల గురించి భారీ కథనం ప్రచురించారు. ఈ కథను ట్రంప్ అధ్యక్ష కలలకు తెరదించేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎన్నో కేసుల్లో దోషిగా తేలి శిక్ష కూడా ఎదుర్కొన్న ఫ్యాట్ టోనీతో ట్రంప్ కు వ్యాపార సంబంధాలున్నాయని తెలిసి అమెరికన్ జనాలు విస్తుపోతున్నారు. ఇప్పటికే ట్రంప్ కు మాఫియా వాళ్లతో సంబంధాలున్నట్లు వార్తలొచ్చినా అవి కేవలం ఆయన ప్రత్యర్థులు నోటి మాటగా చేసిన ఆరోపణలు మాత్రమే. కానీ కానీ జాన్ స్టన్ లాంటి క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టు ఆధార సహితంగా కథనాలు ప్రచురించడంతో ట్రంప్ కు ఇది పెద్ద ఎదురు దెబ్బే అని భావిస్తున్నారు. ఐతే తనకు ఫ్యాట్ టోనీతో సంబంధాలు లేవని.. ఈ కథనం రాసిన జాన్ స్టన్‌పై కేసు వేస్తానని ట్రంప్ హెచ్చరించాడు.