ఇప్పటికున్న సమస్యలు చాలవన్నట్లుగా ట్రంప్ నకు దిమ్మ తిరిగిపోయే కథనాన్ని అచ్చేసింది ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్. తనపై మీడియా కత్తి కట్టినట్లుగా ఆరోపించే ట్రంప్ కు మరింత మండిపోయేలా తాజా కథనం ఉంది. అధ్యక్ష ఎన్నికల ముందు నుంచి ట్రంప్ మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో.. వాటికి మరింత బలాన్ని చేకూర్చేలా కథనం ఉండటం గమనార్హం.
అమెరికాకు సంబందించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి లావ్ రోవ్ తో ట్రంప్ పంచుకున్నట్లుగా వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. గత ఏడాది శ్వేతసౌధంలో జరిగిన భేటీ సందర్భంగా ట్రంప్ సదరు సమాచారాన్ని పంచుకున్నట్లుగా పేర్కొంది. ఎవరికీ చెప్పకూడని విషయాల్ని లీక్ చేశారంటూ అందులో పేర్కొంది. అయితే.. వాషింగ్టన్ కథనాన్ని వైట్ హౌస్ అధికారులు ఖండించారు. సదరు మీడియా కథనం అబద్ధాలతో కూడుకున్నదంటూ జాతీయ భద్రతా సలహాదారుతో సహా పలువురు తప్పు పట్టారు.
ఇదిలా ఉంటే.. తమ కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ సమర్థించుకుంది. దేశ భద్రతకు సంబంధించి సమాచారాన్ని రష్యాకు నేరుగా కాకుండా.. అధికారులు ఉపయోగించే ప్రత్యేక కోడ్ భాషలో పంచుకున్నట్లుగా వెల్లడించింది. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాల్ని పంచుకోగా.. ట్రంప్ లీక్ చేసినట్లుగా చెప్పింది. రష్యా రాయబారితో ట్రంప్ చాలా సమచారాన్ని పంచుకున్నారని.. అదెంత అంటే.. మన దేశానికి భాగస్వామ్యం ఉన్న దేశాలతో ఎంత సమాచారాన్ని పంచుకుంటామో.. అంతకు మించిన సమాచారాన్ని పంచుకున్నట్లుగా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ విజయంలో రష్యా కీలకభూమిక పోషించిందన్నా ఆరోపణల నేపథ్యంలో.. తాజాగా పబ్లిష్ అయిన వాషింగ్టన్ పోస్ట్ కథనం సంచలనంగా మారింది. మరీ.. కథనం రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/