అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఉత్తరకొరియా రథసారథి కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాటల తూటాలు పేలిన పరిస్థితి కొద్దికొద్దిగా సద్దుమణుగుతున్న క్రమంలో తాజాగా మరో వివాదంతో ఈ ఇద్దరు నేతల పంచాయతీ తెరమీదకు వచ్చింది. ట్రంప్ అసియా పర్యటన నేపథ్యంలో ఆయనపై ఉత్తరకొరియా విమర్శలు చేయగా ట్రంప్ సైతం అదే రీతిలో రియాక్టయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్దోన్మాది అని ఉత్తరకొరియా అభివర్ణించింది. అందులో భాగంగానే ట్రంప్ తన ఆసియా ఖండ పర్యటనలో భాగంగా వియత్నాంలో పర్యటించారని ఉత్తరకొరియా శనివారం పేర్కొంది.
దీనికి ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు. తనను అవమానించేలా కిమ్ వ్యవహరించాడని ఆరోపించారు. ముసలివాడు అని తనను విమర్శించి.. అవమానించారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. `కిమ్ ను పొట్టోడు..బండోడు అంటూ నేను కిమ్ పై విమర్శలు చేశానా? నన్ను ముసలోడు అని విమర్శించడం ఎందుకు? ` అంటూ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కిమ్ తో దోస్తీకే తాను ప్రయత్నం చేస్తున్నానని పేర్కొంటూ ఈ మిత్రుత్వం ఎప్పుడో ఒకప్పుడు కుదురుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
కాగా, అమెరికా ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుగజేసుకోలేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. వియత్నాంలోని డానంగ్ లో జరిగిన ఎపెక్ సదస్సులో భాగంగా పుతిన్ తో రెండుమూడుసార్లు మాట్లాడినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో హనోయి వెళ్తుండగా మీడియాకు ఈ వివరాలను ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని పుతిన్ చెప్పారని తెలిపారు. తనను ఇదే అంశంపై చాలాసార్లు ప్రశ్నించానని.. కానీ అందుకు ఆయన ఒకటే సమాధానం ఇచ్చారని చెప్పారు. అయితే ట్రంప్ మాజీ సహాయకులు రష్యాలోని క్రెమ్లిన్ నుంచి సహకారం పొందారని అమెరికా విచారణ సంస్థలు పేర్కొంటున్నాయి.