తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ వీలైనంత దూకుడుగా ముందుకు సాగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తుంటే అంతే వేగంతో ఆయన దూకుడుకు బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే వలసదారుల కట్టడి విషయంలో ఇటు అమెరికన్లు - అటు న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తింటున్న ట్రంప్...ఈ రీతిలోనే తాజాగా మరో షాక్ ఎదురుకున్నారు. అయితే అది చట్టసభల నుంచి కావడం విశేషం. మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రవేశపెట్టిన ఒబామాకేర్ స్థానంలో కొత్త హెల్త్ పాలసీ తీసుకురావాలన్న ట్రంప్ కు ఏదో ఒక అడ్డంకి వచ్చిపడుతూనే ఉంది. ఒబామాకేర్ లో మార్పులు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. అయితే కోరం(ఓటింగ్ లో పాల్గొనేందుకు పూర్తి స్థాయి సభ్యులు) లేకపోవడంతో ఓటింగ్ ను ఒకరోజుపాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పాల్ ర్యాన్ ప్రకటించారు.
ఈ పరిణామంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తన పార్టీకి రిపబ్లికన్ ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లును పాస్‌చేయించాల్సిందేనని ఆదేశించినట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ లో బిల్లు పాస్ కాకపోతే ట్రంప్ తన ఆలోచనలను అమలు పరిచేందుకు వేరే మార్గాన్ని ఎంచుకుంటారని వైట్ హౌస్ బడ్జెట్ డైరెక్టర్ మైక్ ముల్వనై తెలిపారు. సీనియర్ ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మాట్లాడుతూ.. ట్రంప్ బిల్లుతో 2.4 కోట్ల మంది అమెరికన్లు నష్టపోతారు కాబట్టి తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రజల సంక్షేమం కోణంలో ఆలోచించే వారు ఎవరైనా ఈ బిల్లును తప్పకుండా అడ్డుకుంటారని అన్నారు.
కాగా, వైట్ హౌస్ లో ట్రక్ డ్రైవర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఒబామాకేర్ కారణంగా డ్రైవర్లు బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయాల్సి వచ్చిందని, కానీ ఆ స్థాయిలో లాభాలు పొందలేకపోయారని చెప్పారు. తాము రూపొందించే బిల్లుతో ఇకపై ఇలాంటి కష్టం ఉండబోదన్నారు. మరోవైపు తనకే ప్రత్యేకమైన హావభావాలతో క్రేజ్‌ను సంపాదించుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సమావేశం సందర్భంగా ట్రక్ డ్రైవర్ అవతారం ఎత్తారు. సమావేశం అనంతరం వైట్ హౌస్ ఆవరణలో ఉన్న ట్రక్ లోకి ఎక్కి స్టీరింగ్ పట్టుకొని ట్రక్ నడుపుతున్నట్టు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించి వైట్ హౌస్ మీడియాకు విడుదల చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/