ట్రంప్ ఫోక‌స్ మొత్తం మారిపోయింది

Update: 2017-02-08 09:40 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం తగ్గించి ఇపుడు సొంత దేశంలోని స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. గత నవంబర్‌ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లక్షలాది మంది ప్రజలు అక్రమంగా ఓటు వేశారన్న తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఓటర్లుగా నమోదు కాని వారు, పౌరసత్వ రిజిస్టర్లలో పేర్లు లేని వారు అనేక మంది ఈ ఎన్నికల్లో ఓటు వేశారని, కొంతమంది చనిపోయిన వారిపేర్లతో ఓట్లు వేశారని ఆయన ఒక టీవీ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇది నిజంగా అధ్వానమైన పరిస్థితి అని ఆయన అభివర్ణించారు. ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లతో ట్రంప్‌ విజయం సాధించినప్పటికీ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ కన్నా కొద్ది సంఖ్యలో మాత్రమే అదనంగా లభించాయి. అక్రమ బ్యాలెట్లు లక్షల్లో ఉన్నాయని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఓటింగ్‌ మోసాలపై తాము దర్యాప్తు జరిపిస్తామని గత నెలలో ట్రంప్‌ హెచ్చరించారు. త‌ద్వారా ఓటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే తరువాత ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ దర్యాప్తు అంశం ఇప్పుడు ప్రాధాన్యతను కోల్పోయిందని, సమీప భవిష్యత్తులో ఇటువంటి దర్యాప్తు ఏదీ వుండబోదని అమెరికా ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వివరించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న 'ఘర్షణాత్మక' వైఖరి, ట్రంప్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలకు తీరని చేటు జరుగుతోందని పెరూ వియన్‌ ఆర్థిక వేత్త మార్కో కరాస్కో ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ నిర్ణయాలు అత్యంత దుర్మార్గపు చర్యలని, ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా వాషింగ్టన్‌ లో అధికశాతం మంది ప్రజల అభిప్రాయం ఇదేనని ఆయన వివరించారు. కొన్ని అంశాల్లో నైనా ట్రంప్‌ తన వైఖరి మార్చుకుంటాడని భావిస్తున్నామన్నారు. ట్రంప్‌ దాడి చేస్తున్న దేశాల్లో ఒకటైన మెక్సికో సరిహద్దు గోడ వెనుక అనేక ఆర్థిక సమస్యలున్నాయన్నారు. అమెరికాతో సుదీర్ఘమైన సరిహద్దు కలిగి వున్న మెక్సికో ఆ దేశంతో అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో మూడో స్థానంలో వుందని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో నివశించే వారిలో మెక్సికో - పెరూ - తదితర సెంట్రల్‌ అమెరికా దేశాల వాసులు ఎక్కువగా వున్నారని, వారు పంపే డబ్బుపై అమెరికా పన్ను విధిస్తే అది లాటిన్‌ అమెరికా దేశాలకు సమస్యగా మారే ప్రమాదం వుందని కరాస్కో వివరించారు. దాదాపు 23 ఏళ్ల క్రితం అమెరికా - మెక్సికో - కెనడా దేశాల మధ్య కుదిరిన ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తిరగదోడేందుకు కూడా ట్రంప్‌ సిద్ధమవుతున్నారని,

ఇదిలాఉండ‌గా..అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ లండన్ నిర‌సన ప్రదర్శనలతో హోరెత్తింది. లండన్‌ నగరంలో దాదాపు లక్ష మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శన జరుపగా బ్రిటన్‌ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగిన ప్రదర్శనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ నిరసన ప్రదర్శనలకు స్టాప్‌ వార్‌ కొయలియేషన్‌ - పీపుల్స్‌ అసెంబ్లీ - స్టాండప్‌ టు రేసిజం - ముస్లిం కౌన్సిల్‌ ఆఫ్‌ బ్రిటన్‌ వంటి సంస్థలు సారధ్యం వహించాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారిలో అధికశాతం మంది యువతే కావటం విశేషం. పర్యాటకులపై ట్రంప్‌ విధించిన నిషేధం - ట్రంప్‌ సర్కారు కొనసాగిస్తున్న ఇతర విధానాలకు వ్యతిరేకంగా వారు బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News