నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వార్తల్లో నిలవటం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని తపిస్తున్న ట్రంప్ ను ఇప్పుడు ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన పేరును ప్రస్తావిస్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాట అనేంత పరిస్థితి. తాజాగా ఆయన వాషింగ్టన్ పోస్ట్ కు ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన పెళ్లాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇద్దరు మాజీ భార్యల మాటలతో పాటు.. తన మూడో ముద్దుల పెళ్లాం గురించిన వివరాల్ని వెల్లడించటంతో పాటు.. తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద వారి స్పందన చెప్పేందుకు వెనుకాడలేదు.
మనం హాయిగా.. ఆనందంగా జీవిస్తున్నాం.. మనకెందుకీ రాజకీయాలని తన మూడో భార్య.. మెలానియావి అన్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో తన మాజీ మొదటి భార్య మాత్రం తాను అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో ఓకే అని చెప్పినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ కోసం ఆయన మూడో భార్య మెలానియావి సోమవారం నుంచి ప్రచారం చేయనున్నారు. చూస్తుంటే.. ట్రంప్ పాలిటిక్స్ లోకి రావటం ఇంట్లో భార్యకు కూడా ఇష్టం లేదన్న మాట.