ఎప్పుడూ జరిగే ముచ్చటే మరోసారి చోటు చేసుకుంది. ఏటా తమ కుటుంబం ఆస్తుల లెక్కను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ వెల్లడించటం.. దానికి కౌంటర్ గా జగన్ బ్యాచ్ భారీ కథనాన్ని అచ్చేయటం రివాజే. తాజాగా అలాంటి సీనే మరోసారి రిపీట్ అయ్యింది. దేశంలో మరే పొలిటికల్ ఫ్యామిలీ కూడా తమ మాదిరి నికార్సుగా ఆస్తుల చిట్టాను ప్రకటించే సత్తా లేదంటూ గొప్పలు చెప్పుకుంటూ ఆస్తుల లెక్కను విడుదల చేస్తుంటుంది చంద్రబాబు కుటుంబం. ఇలా విడుదల చేసే ఆస్తుల లెక్కలోని డొల్లతనాన్ని తెర మీదకు తీసుకొస్తూ.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ బ్యాచ్ భారీగా కథనాన్నేఅచ్చేస్తుంటారు.
బాబు ఫ్యామిలీ ఆస్తుల పై సూటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే జగన్ బ్యాచ్..తాజాగా అలాంటి పనినే విజయవంతంగా పూర్తి చేసింది. రాజకీయాల్లో విమర్శలు మామూలే అయినా.. ప్రత్యర్థి చేసే విమర్శలో లాజిక్ కనిపించి..సామాన్యుడు కన్విన్స్ అయ్యేలా ఉంటేనే అసలు చిక్కంతా. తాజాగా చినబాబు విప్పి చెప్పిన ఆస్తుల లెక్కలో డొల్లతనం భారీగా ఉండటం.. ఆస్తుల లెక్కను చూసినంతనే కలిగే సందేహాలు కలగలిపి.. జగన్ బ్యాచ్ అచ్చేసింది. మరి.. ఆ సందేహాల చిట్టాను యథాతధంగా ఒక్కసారి చూస్తే.. నిజమే కదా? అన్న భావన కలుగుతుంది. మరి.. జగన్ బ్యాచ్ చెబుతున్న లెక్కలు.. వేస్తున్న ప్రశ్నల్ని చూస్తే..
= బాబు సొంత గ్రామమైన నారావారిపల్లిలో దాదాపు ఎకరం స్థలంలో కడుతున్న భవనం గిఫ్ట్ గా పేర్కొన్నారు నారా లోకేశ్. భూమి వరకూ బాబు తల్లిదండ్రుల నుంచి వచ్చిందని అనుకుంటే.. భవనాన్ని బాబుకు గిఫ్ట్ గా ఇచ్చిందెవరు? దాని విలువ ఎంత? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు.
= అప్పుడెప్పుడో అంటే.. 15 ఏళ్ల కిందట జూబ్లీహిల్స్ లో రూ.25 లక్షలు పెట్టి కొన్న బిల్డింగ్ ఇప్పుడు రూ.50 కోట్లు పలుకుతున్న పరిస్థితి. అయినా.. లోకేశ్ తన తాజా లెక్కల్లో రూ.25 లక్షలు చెప్పటం ఏమిటి?
= హెరిటేజ్ ఫుడ్స్ లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి 53,30,826 షేర్లు ఉన్నాయి. బుధవారం నాటి హెరిటేజ్ షేర్ ఒక్కొక్కటి రూ.902 విలువ ఉన్ననేపథ్యంలో.. ఆమె వద్దనున్న షేర్ల మార్కెట్ విలువ రూ.480 కోట్లు. అందులో హెచ్చుతగ్గులకు కాస్త మొత్తాన్ని తగ్గించినా రూ.400 కోట్లకు ఎంతమాత్రం తగ్గదు. కానీ.. లోకేశ్ మాత్రం ఆ మొత్తాన్ని రూ.19.95 కోట్లుగా చూపించారు. ఈ లెక్కన లోకేశ్ వెల్లడించిన ఆస్తులు కొన్ననాటి విలువను చూపిస్తున్నారా? తాజా మార్కెట్ విలువను చూపిస్తున్నారా? అన్నది ప్రశ్న. కొనుగోలు సమయం నాటి విలువను చూపించటమే లక్ష్యమైతే.. ప్రతి ఏడాది ఆస్తుల్నిప్రకటిస్తున్నట్లుగా చేసే ప్రకటనలో అర్థం లేదని చెప్పక తప్పదు.
= గతేడాదికి.. ఈ ఏడాదికి మధ్య భువనేశ్వరి వద్దనున్న బంగారు ఆభరణాల విలువ లెక్క చూస్తే షాక్ తినాల్సిందే. ఎందుకంటే గతేడాది భువనేశ్వరి వద్ద 3,380 గ్రాముల బంగారం ఉందని చెప్పగా.. ఈసారి 3,519గ్రాములు ఉన్నట్లు చెప్పారు. అయితే.. గతేడాది బంగారం లెక్కను రూ.26.96లక్షలుగా చూపించిన బాబు ఫ్యామిలీ.. ఈసారి మాత్రం బంగారం లెక్క కింద దాని విలువ రూ.1.27 కోట్లుగా చూపించారు. ఏడాది వ్యవధిలో పెరిగిన బంగారం 139 గ్రాములు అయితే.. పెరిగినట్లుగా చూపించిన విలువ మాత్రం రూ.కోటి కావటం గమనార్హం. ఈ లెక్క ఎలా లెక్కేశారో లోకేశ్ కే తెలియాలి.
= జూబ్లీహిల్స్ లో ప్లాటు విలువను గతేడాది రూ.2.36 కోట్లుగా చూపించిన లోకేశ్... ఇపుడు స్వల్పంగా పెంచి రూ.3.68 కోట్లుగా చెప్పారు. కొన్నప్పటి విలువనే చూపిస్తున్నామన్నపుడు ఇదెలా పెరిగింది? నోటికొచ్చినట్టు చెప్పటమేనా ఆ లెక్క?
= మదీనాగూడలో ఐదెకరాల్ని కొన్నానని.. ఐదెకరాలు మాత్రం నానమ్మ నుంచి గిఫ్ట్ గా వచ్చిందని లోకేశ్ చెప్పారు. పసుపు కుంకుమగా వచ్చిన అరెకరం తప్ప ఏమీ ఆస్తుల్లేని అమ్మణ్ణమ్మ... లోకేశ్ కు అంత బహుమతి ఎలా ఇచ్చారు?
= ముంబయి శివార్లలో తనకున్న స్థలం విలువను రెండు మూడేళ్ల పాటు రూ.58.69 లక్షలుగానే చూపించారు. ఈసారి అమ్మేసినట్లుగా చెప్పారు. ఎంతకు అమ్మారని చూస్తే.. కోట్లాది రూపాయిల విలువైన ఆ ఆస్తిని అమ్మింది ఎంతకు?
= హెరిటేజ్ ఫుడ్స్ లో తనకున్న 23,66,400 షేర్ల విలువను రూ.2.21 కోట్లుగా చూపించారు. కానీ దాని అసలు విలువ రూ.212 కోట్లు కావటం గమనార్హం.
= ఈసారి బ్రాహ్మణి ఆస్తుల్లోకి కొత్తగా ఓ ప్లాటొచ్చి చేరింది. జూబ్లీహిల్స్ లో 650గజాల్లో ఏకంగా 6,000 చదరపు అడుగుల్లో నిర్మించి ఉన్న భవనాన్ని ఆమె పేరిట చూపించారు. రూ.3.5 కోట్లుగా దాని విలువను చూపిస్తూ... ఎక్స్ చేంజ్ డీడ్ గా పేర్కొన్నారు. గతేడాది చూపించిన ఆస్తుల్లో నందగిరి హిల్స్ లో 778 గజాల స్థలం ఉంది. ఇపుడది లేదు. అంటే ఈ స్థలాన్నిచ్చి ఆ భవనాన్ని తీసుకున్నట్లా?
= మాదాపూర్ లోని 924 గజాల ప్లాటు విలువను గతేడాది 3.37 లక్షలుగా చూపించారు. ఈసారి రూ.17 లక్షలుగా చూపించారు. ఒకవేళ మార్కెట్ విలువ ప్రకారం రూ.80లక్షల ఉండాల్సి ఉన్నా.. రూ.17 లక్షలే చూపించటం గమనార్హం. ఈ మొత్తాన్ని కొన్నప్పటి రేటు చూపించారా? అన్నదానిపై స్పష్టత లేదు.
= హెరిటేజ్ ఫుడ్స్ లో బ్రాహ్మణి వాటా విలువను రూ.78 లక్షలుగా చెబితే.. దాని అసలు విలువ 9.09 కోట్లు.
= లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియాలో రూ.70 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎల్ ఐసీ అనుబంధ సంస్థ ఎల్ ఐసీ హోమ్ ఫైనాన్స్ మాత్రమే లిస్టయింది. మరి ఎల్ ఐసీ ఆఫ్ ఇండియాలో వీళ్లకెవరు వాటా అమ్మినట్లు?
= 97 కిలోల వెండి ధరను గతేడాది 3.3 లక్షలుగా చూపిస్తే.. ఈసారి మాత్రం రూ.12.37 లక్షలుగా చూపించారు. ఏడాదిలో వెండి ధర 4 రెట్లు పెరిగిందా?
= ఈసారి నారా ఫ్యామిలీ ఆస్తుల జాబితాలోకి కొత్తగా వచ్చి చేరింది చంద్రబాబు మనవడు దేవాన్ష్. అతనికి జూబ్లీహిల్స్ లో 1191 చదరపు గజాల స్థలం. దాన్లో 19,500 చదరపు అడుగుల భవనం కలిపి ఉన్నాయని దాన్ని ఈ ఏడాదే రూ.9 కోట్లకు కొన్నామని చెప్పారు. చదరపు అడుగుకు రూ.1,500 నిర్మాణ ఛార్జీలు వేసుకున్నా దాదాపు రూ.3 కోట్లు. స్థలం విలువ కనీసం 25 కోట్లు. మరి రూ.9 కోట్లకు ఎవరిచ్చారు? దీన్ని నానమ్మ భువనేశ్వరి బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
= నిర్వాణా హోల్డింగ్స్ కు వివిధ కంపెనీల్లో వాటాలున్నాయి. ఒక్క హెరిటేజ్ ఫుడ్స్ లో దానికున్న వాటా విలువే రూ.231 కోట్లు. కానీ దీన్ని 10.82 లక్షలుగా మాత్రమే చూపించి.. నిర్వాణాకు 43.95 లక్షల నికర అప్పులున్నట్లు పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/