డ్రగ్స్ కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

Update: 2022-04-18 10:30 GMT
హైదరాబాద్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు అనిల్ కుమార్, అభిషేక్ ల కస్టడీ ముగియడంతో పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వారిని జైలుకు తరలించారు. నిందితులను నాలుగు రోజుల పాటు విచారించిన బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ కన్ఫేషన్ స్టేట్ మెంట్ ను కోర్టులో దాఖలు చేశారు.

బంజారాహిల్స్ రాడిసన్ బ్లూలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీ ఆదివారం ముగిసింది. పబ్ నిర్వాహకుడు అభిషేక్, మేనేజర్ అనిల్ ను పోలీసులు నాలుగు రోజుల పాటు విచారించారు. కస్టడీ పూర్తి కావడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా నిందితులు నోరు మెదపలేదు.

నిందితులు సహకరించకపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. పబ్ పై దాడులు, నిందితుల అరెస్ట్ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ అవి కేసుకు బలాన్ని ఇచ్చేలా లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈనెల 3న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడి జరిగిన తర్వాత నిర్వాహకుడు అభిషేక్,అనిల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు డెస్క్ మీద ఉన్న 5 మిల్లీ గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

పబ్ లో దొరికిన డ్రగ్స్ పై   నిర్వాహకులు అనిల్, అభిషేక్ లను పోలీసులు విచారించారు. ఇందులో అనిల్ వాట్సాప్ చాట్ లో కోడింగ్ తో చేశారని.. ఇదంతా డ్రగ్స్ కోసమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వీకెండ్ పార్టీలను అనిల్ ఏర్పాటు చేస్తుండగా.. అభిషేక్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపుతున్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.

ఇక మూడు టేబుల్స్ పై దొరికిన కొకైన్ పై ఈరోజు పోలీసులు ఇద్దరినీ ప్రశ్నించనున్నారు. వీరిద్దరూ చెప్పే సమాధానాలతో ఈరోజు మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. మొత్తంగా ఈరోజు విచారణలో డ్రగ్స్ కు సంబంధించి నిందితుల వద్ద నుంచి సమాచారం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక పబ్ లో దొరికిన కొకైన్ ను ఎవరు సరఫరా చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆ పెడ్లర్ ఎవరనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సేకరించిన ఆధారాలు, వీడియో గ్రఫీని ముందుపెట్టి మరీ పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మేనేజర్ అనిల్ విచారణ తర్వాత అభిషేక్ ను పోలీసులు విచారించనున్నారు.
Tags:    

Similar News