దుర్గగుడి రధం కేసు : దిక్కుతోచని స్థితిలో పోలీసులు..ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఏముందంటే?
విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యటం తెలిసిందే. ఇప్పటివరకు 100 మందిని విచారించిన పోలీసులు ఎటువంటి క్లూ పట్టుకోలేక పోయారు. దీంతో ఏమి చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.
ఇక, విజయవాడలోని దుర్గగుడిలో వెండి రథం ప్రతిమల చోరీకి గురైన రథాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రధం నుండి వేలిముద్రలను సేకరించారు. కీలక కేసు కావడంతో ఫోరెన్సిక్ డైరెక్టర్ ఆర్.కే శారీన్ నేరుగా వచ్చి పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన రధాన్ని పరశీలించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, దేని సహాయంతో ప్రతిమలు చోరీ చేశారనే అంశాలపై ఫోరెనిక్స్ బృందం నివేదిక ఇస్తే, ఆ నివేదిక ఆధారంగా ఈ కేసును వేగంగా పరిష్కరించవచ్చు అని పోలీసులు వేచి చూసారు.
అయితే, ఫోరెన్సిక్ అధికారులకు కూడా అక్కడ చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మూడు వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి అన్న దానిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఏడాది జూన్ నెలలో వెండి సింహాలు మాయం అయినట్టు గుర్తించారు. దీనితో ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎవరు చేసారో తేలుతుంది అని భావిస్తే , ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసులో ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచనలో పడ్డారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఏమీ కనిపించకపోవడంతో ఇది ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు మౌనం పాటిస్తునట్లు పలువురు ఆరోపణలు కూడా చేస్తున్నారు.