కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించగలడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ఇక ప్రత్యర్థులకు చుక్కలే. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటాడు. అయితే రస్సెల్ గత సీజన్ లో పెద్దగా రాణించలేకపోయాడు. అందుకు గాయాలు కూడా ఓ కారణం. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 సీజన్ 14 ఎడిషన్ లో భాగంగా ఇవాళ సాయంత్రం ఎస్ఆర్హెచ్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రస్సెల్ డిఫరెంట్ లుక్ తో ఉన్న ఫొటోలను షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ గా మారాయి. రస్సెల్ రంగేశాడంటే.. ఇక ఎస్ఆర్హెచ్ కు చుక్కలే. అంటూ నైట్‌రైడర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఐపీఎల్ 2021లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ముగిశాయి. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. ఇవాళ మూడో మ్యాచ్ జరుగనున్నది.
చెన్నై చేపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఎస్ఆర్హెచ్.. కేకేఆర్ జట్టు పోరాటానికి సిద్ధమయ్యాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. గత ఏడాది ఐపీఎల్ సన్ రైజర్స్ అద్భుతంగా రాణించింది. మూడోస్థానంలో నిలిచింది. కేకేఆర్ మాత్రం ప్లేఆప్స్ కు కూడా వెళ్లలేకపోయింది.ఈ సారి ఇరుజట్లు వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతున్నాయి. కోల్‌కతా ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. న్యూ లుక్ తో అదరగొడుతున్నాడు. జుట్టుకు రంగు వేసుకొని కొత్త స్టయిల్ లో కనిపిస్తున్నాడు. తన వెంట్రుకలను లేత గోధుమ రంగు కలర్ తో నింపేశాడు. ట్రెండీ హెయిర్ స్టైల్ తో ఫొటోలకు ఫోజులిచ్చాడు.
ప్రతి ఐపీఎల్ లోనూ న్యూలుక్ లో ఎంట్రీ ఇవ్వడం రసెల్‌కు అలవాటు. 2019 ఐపీఎల్ సీజన్ లో జుట్టుకు రంగు వేసిన అనంతరం ఆడిన మ్యాచ్ లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 19 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఆటతీరును ప్రదర్శించడానికి ఆండ్రీ రస్సెల్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఇవాళ రసెల్ ఎటువంటి ప్రదర్శన ఇవ్వబోతున్నాడో వేచి చూడాలి.