చివరి గడియల్లో చిలిపి కోరిక కోరిన 85 ఏళ్ల పెద్దాయన!

Update: 2019-11-29 01:30 GMT
మనిషి ఎక్కడినుండి వచ్చాడో చివరికి అక్కడికి చేరాల్సిందే. కానీ , ఒకరు ముందే వెళ్ళిపోతారు..మరికొంతమంది కొన్ని రోజుల తరువాత వెళ్తారు. కానీ , ఇక్కడ ఉన్న ఆ కొన్ని రోజులు నా కుటుంబం - నా సంపాదన అంటూ జీవితంలో శాంతి అనేదే లేకుండా ఉంటారు. ఇక జీవితం చరమాంకం లోకి వచ్చే సరికి కొన్ని తీరని కోరికలుంటాయి - ఆ కోరికలను అడిగి మరీ తీర్చుకుంటారు చాలామంది.కొందరు ఇష్టమైన వాళ్లని చూడాలనుకుంటారు, ఇంకొంతమంది వారసులకు తమ ఆస్తులను పంచి పెడుతుంటారు. కానీ ,అమెరికా కి చెందిన నార్బర్ట్ స్కెమ్ అనే వ్యక్తి తన చివరి కోరికని తన కొడుకులకి చెప్పి ..వారితో కలిసి ఆ కోరికని తీర్చుకొని ఆ తరువాత కొన్ని గంటలకే కన్నుమూశాడు.

87 ఏళ్ల నార్బర్ట్ స్కెమ్ అమెరికాలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈయనకి నలుగురు కొడుకులు. వారిని పెంచి పెద్దచేసి , పెళ్లిళ్లు చేసారు. కొడుకులు - కోడళ్లు - మనవళ్లు - మనవరాళ్లు అందరికీ ఆస్తుల్ని - ఆప్యాయతల్ని పంచాడు. ఇక జీవితం చివరికి వచ్చేసరికి ..  కొలొన్ క్యాన్సర్ వచ్చింది. దీనితో అయన నలుగురు కొడుకులు తమ తండ్రి కోసం అన్ని ప్రయత్నాలు చేసారు. కానీ , డాక్టర్లు మాత్రం .. ఇక ఆశలు వదులుకోండి అని చెప్పడంతో చాలా బాధపడ్డారు.  చిన్నగా ఇక ఎక్కువ రోజులు నేను బ్రతకను అని ఆయనకి కూడా తెలిసింది.

దీనితో చివరిక్షణాల్లో ఏం కావాలి నాన్నా అని నలుగురు కొడుకులు అడగ్గానే అందరం కలిసి సరదాగా బీర్ తాగుదాం అని తన చివరి కోరికని చెప్పాడు. వెంటనే  క్షణాల్లో అందరి చేతిల్లో బీర్ బాటిల్స్ ప్రత్యక్షమయ్యాయి...హాస్పిటల్ రూమ్‌ ని బార్‌ గా మార్చేశారు. ఆయన సంతోషం కోసం అందరూ కలిసి  బీర్ తాగారు. ఆ సమయంలో వారు ఒక ఫోటో తీసుకున్నారు. ఆ తరువాత కొన్ని గంటలకే అయన చనిపోయినా  ఎంతో ఆనందంతో నవ్వుతున్న నార్బర్ట్ చివరి ఫొటో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. చావుని కూడా నవ్వుతు తన జీవితంలోకి ఆహ్వానించిన నార్బర్ట్ స్కెమ్  గ్రేట్ అంటూ అందరూ అయన పై పొగడ్తలు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News