కూక‌ట్ ప‌ల్లి బ‌రిలోకి పెద్దిరెడ్డి..ఎందుకు?

Update: 2018-09-18 06:26 GMT
ఆశ మ‌నిషిని ఎంత‌లా మారుస్తుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న స్థాయికి ఏ మాత్రం స‌రిపోద‌ని తెలిసినా.. ఆశ కొంత‌మంది నేత‌ల స్థాయిని త‌మ‌కుతాము త‌గ్గించుకునేలా చేస్తుంది. అలాంటి ప‌నే ప్ర‌స్తుతం టీటీడీపీ సీనియ‌ర్ నేత‌.. టీటీడీ బోర్డు స‌భ్యుడు పెద్దిరెడ్డి చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూకుట్ ప‌ల్లి అసెంబ్లీ బ‌రిలో  దిగేందుకు సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాల మాట ఆ పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. కూక‌ట్ ప‌ల్లితో ఎలాంటి అనుబంధం లేని పెద్దిరెడ్డి.. ఏ అంశాల ప్రాతిప‌దిక‌గా ఆ సీటును కోరుకుంటార‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. తెలుగుదేశం పార్టీకి మంచి ప‌ట్టు ఉంద‌న్న సానుకూల‌తే పెద్దిరెడ్డి చూపు కూక‌ట్ ప‌ల్లి మీద ప‌డేలా చేసింద‌ని చెబుతారు.

2014 ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థిగా మాధ‌వ‌రం కృష్ణారావు బ‌రిలోకి దిగి విజ‌యం సాధించ‌టం.. అనంత‌రం ఆయ‌న గులాబీ కారు ఎక్కేయ‌టం తెలిసిందే. న‌మ్మి ఓటేస్తే.. పార్టీ మారిన తీరుపై మాధ‌వ‌రంపై స్థానికులు ఆగ్ర‌హంతో ఉన్నారు. అదే స‌మ‌యంలో.. ప‌లువురుస్థానిక నేత‌లు కూక‌ట్ ప‌ల్లి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇలాంటివేళ‌.. పెద్దిరెడ్డి పేరు తెర మీద‌కు వ‌చ్చింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆయ‌నకుచెందిన హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దులుకొని మ‌రీ కూక‌ట్ ప‌ల్లి అసెంబ్లీ సీటు మీద ఆయ‌న క‌న్ను ప‌డ‌టానికి కార‌ణం.. టీడీపీ అభ్య‌ర్థికి కూక‌ట్ ప‌ల్లికి మించిన సుర‌క్షిత‌మైన స్థానం మ‌రొక‌టి లేద‌న్న అభిప్రాయ‌మే. కాంగ్రెస్ మ‌హా కూట‌మిలో భాగంగా కూక‌ట్ ప‌ల్లి సీటును టీడీపీ సొంతం చేసుకోనున్న నేప‌థ్యంలో.. ఎవ‌రు అభ్య‌ర్థి అయినా ఇట్టే గెలిచే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ కార‌ణంతోనే.. కూక‌ట్ ప‌ల్లి మీద పెద్దిరెడ్డిచూపు ప‌డింద‌న్న అభిప్రాయం ఉంది. త‌న‌కు తానే స్వ‌యంగా ఫోన్లు చేస్తున్న పెద్దిరెడ్డి.. త‌న‌కు టికెట్ తెచ్చుకునేందుకు.. బాబును ఒప్పించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి.. ఆయ‌న ప్ర‌య‌త్నాల‌కు బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News