అఫ్ఘన్.. పాక్.. భారత్ లో భూప్రకంపనలు

Update: 2015-11-23 04:12 GMT
ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత అఫ్ఘనిస్థాన్ .. తజకిస్థాన్ సరిహద్దుల్లోని భూగర్భం లోని 86 కిలోమీటర్ లోతులో చోటు చేసుకున్న భూకంప కేంద్రం పుణ్యమా అని పలు దేశాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భూప్రకంపనల కారణంగా పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్ తోపాటు. భారత్ లోనూ భూమి కంపించింది.

తాజా భూప్రకంపనల కారణంగా పాక్ లోని ఖైబర్.. ఫఖునిస్థాన్ ప్రాంతాల్లో ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. భూకంప లేఖి సూచి మీద 6.2 గా నమోదైన భూకంప తీవ్రత.. భారత్ లోని జమ్మూకాశ్మీర్.. ఢిల్లీల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారత్ తో పోలిస్తే.. పాక్ లోని లాహోర్.. రావల్పిండి.. ఫైసలాబాద్.. ఇస్లామాబాద్ నగరాల్లో భూ ప్రకంపనలుకాస్త ఎక్కువగా ఉన్నాయి.
Tags:    

Similar News