నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో మనీ ల్యాండరింగ్ వ్యవహారం కూడా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో... ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్న సీఐడీ విజ్ఝప్తి మేరకు ఈడీ ఏకంగా మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా కేసు నమోదు చేయడంతో పాటుగా ఈ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేసే దిశగానూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుందన్న వార్తలు ఇప్పుడు ఏపీలో పెను కలకలమే రేపుతున్నాయి.
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని కూడా లేకుండ ఏర్పడ్డ నవ్యాంధ్రకు గుంటూరు జిల్లా పరిధిలో, విజయవాడకు అత్యంత సమీపంలో 33 వేల ఎకరాలకు పైగా భూములను సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం దానిని అమరావతి అని పేరు పెట్టేసి.... దానినే రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయంపై ఏపీ జనాన్ని తప్పుదోవ పట్టించిన చంద్రబాబు సర్కారు... తన పార్టీకి చెందిన కీలక నేతలకు ముందుగానే అమరావతిపై సమాచారం అందజేసి... రైతుల నుంచి కారుచౌకగా భూములను కొనేసిందన్న ఆరోపణలు వినిపించాయి. వీటిపై కాస్తంత సీరియస్ గానే వ్యవహరించిన ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మొన్నటి అసెంబ్లీ సమావేశాలకు ముందే సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జగన్ సర్కారు ఆరోపిస్తున్నట్లుగానే... టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్న ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేయడంతో పాటుగా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పొంగూరు నారాయణలపై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులున్న 790 మందికి పైగా పేదలు... రాజధాని పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొనుగోలు చేసిన వైనాన్ని కూడా సీఐడీ వెలికి తీసింది. దీంతో ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ జరిగి ఉంటుందని, తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లు చూపించి టీడీపీ నేతలే ఆ భూములను కొనేసి ఉంటారన్న భావనతో.. ఈ కేసులో ఇన్వాల్వ్ కావాలని, మనీ ల్యాండరింగ్ వ్యవహారాన్ని తేల్చాలని ఈడీకి సీఐడీ లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగానే ఇప్పుడు ఈ వ్యవహారంపై ఈడీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.