ఈటల సై.. కేసీఆర్ తో పోటీ?

Update: 2021-05-05 15:01 GMT
తెలంగాణ మంత్రి వర్గం నుంచి తొలగించబడ్డ ఈటల రాజేందర్ చాలా వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తాను రాజీనామా చేయకుండా.. టీఆర్ఎస్ నుంచి వాళ్లే సస్పెండ్ చేసేలా మంట పెడుతున్నాడు. ఈ మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ టీఆర్ఎస్ కు మంటపుట్టిస్తున్నారు.

తెలంగాణ మంత్రివర్గం నుంచి తీసేయగానే ఇన్నాళ్లు హుజూరాబాద్ లో ఉండి రాజకీయం చేసిన ఈటల ఇప్పుడు తన మకాంను హైదరాబాద్ కు మారుస్తున్నాడు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులతో కలిసి హైదరాబాద్ లో సమాలోచనలు చేయాలనుకుంటున్నాడు. అందరినీ కలుస్తానని.. ఏం చేయాలో తరువాత డిసైడ్ చేస్తానని ఈటల చెబుతున్నారు.

ఇక ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినా టీఆర్ఎస్ నుంచి సాగనంపాలని చూసినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. తనంతట తాను రాజీనామా చేయాలని టీఆర్ఎస్ చూస్తోంది. అలా చేస్తే ఈటలనే బయటకు వెళ్లిపోయాడని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. తప్పు చేశాడు కాబట్టి పోయాడని అపనింద వేస్తుంది.కానీ తాను ఏ తప్పు చేయలేదని.. రాజీనామా చేయను అని ఈటల బీష్మించుకు కూర్చుకున్నారు. వాళ్లనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాడు. అలా చేస్తే తనపై సానుభూతి వస్తుందని ఈటల ఈ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.

ఇక ఈటల రాజీనామా చేసి వెళ్లిపోతాడని అది తమకే లాభం అని టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ భావించింది. కానీ ఈటల మాత్రం అలా చేయకపోవడంతో ఇప్పుడు కక్కలేక మింగలేక నలిగిపోతోంది.

ఈటల మద్దతుదారులు ఏకంగా కేసీఆర్ కే సవాల్ చేస్తున్నారు. ఈటల హుజూరాబాద్ లో రాజీనామా చేస్తాడని.. కేసీఆర్ గజ్వేల్ లో రాజీనామా చేయాలని.. ఇద్దరూ పోటీ పడితే ఎవరు గెలిస్తే వాళ్లే తెలంగాణకు ఓనర్లు అంటూ ‘ఈటల పాత డైలాగ్’ను బయటకు తెచ్చి సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఈటల వర్సెస్ కేసీఆర్ ఫైట్ లాగా పరిస్థితులు మారిపోతున్నాయి.
Tags:    

Similar News