ఎయిరిండియాలో సర్వ్ చేసిన ఫుడ్ ఒక ఎంపీకి భారీ షాకిచ్చింది. ఆహారం తయారీలో చోటు చేసుకున్న నిర్లక్ష్యంపై సదరు ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఫిర్యాదు ఇచ్చారు. గుడ్డు పెంకులతో ఉన్న అమ్లెట్ ను సర్వ్ చేసిన వైనం సంచలనంగా మారింది. తమకు వచ్చిన ఫిర్యాదుపైన ఎయిరిండియా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఇందుకు కారణమైన వారికి భారీ జరిమానాను విధించారు. అయినప్పటికీ.. జరిగిన తప్పుపై వారు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్ ఈ మధ్యన ఫుణె నుంచి ఢిల్లీకి ఎయిరిండియాలో ప్రయాణించారు. బ్రేక్ పాస్ట్ కోసం అమ్లెట్ ను ఆర్డర్ చేశారు. అయితే.. ఆమెకు అందించిన అమ్లెట్ లో కోడిగుడ్డు పెంకులు వచ్చాయి.ఆహారం నాణ్యత కూడా సరిగా లేకపోవటంతో.. ఈ విషయాన్ని ట్వీట్ రూపంలో తనకెదురైన అనుభవాన్ని పేర్కొన్నారు.
ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ఎయిరిండియా.. అమ్లెట్ తయారు చేసి ఇచ్చిన క్యాటరింగ్ ఏజెన్సీకి భారీ జరిమానా విధించారు. నిర్వహణ ఛార్జీలు.. సదరు విమానంలో సరఫరా చేసిన మొత్తం ఆహారానికి అయిన ఖర్చును సదరు సంస్థ భరించాలని పేర్కొన్నారు.
తనకు ఎదురైన చేదు అనుభవంపై ఫిర్యాదు చేయాలని తాను అనుకోలేదని.. కానీ ప్రజాప్రయోజనం కోసం ఫిర్యాదు చేసినట్లుగా తన ట్వీట్లలో వెల్లడించారు. తనకిచ్చిన అమ్లెట్ ఎంత దరిద్రంగా ఉందో సదరు ఎంపీ మాటల్లో చెబితే.. అమ్లెట్ తింటున్నప్పుడు మూడునాలుగుసార్లు కోడిగుడ్డు పెంకులు తగిలాయి. బంగాళదుంప ముక్కలు పాడయ్యాయి. సోయాచిక్కుడు ఉడకలేదు.. ఎయిర్ హోస్టెస్ దీనికి బాధ్యులు కారని భావిస్తున్నా.
ఈ విషయాన్ని వారికి చెప్పినప్పుడు.. వారు స్పందించిన తీరు బాధించింది. ఈ అంశంపై ట్వీట్ చేయాలా? అనిపించినా.. ప్రజా ప్రయోజనార్థం తప్పని పరిస్థితుల్లో ట్వీట్ చేస్తున్నానని వందనా పేర్కొన్నారు. తాను చేసిన ట్వీట్ ను విమానయాన శాఖామంత్రి.. ప్రధాని కార్యాలయానికి.. ఎయిరిండియా ఛైర్మన్ ట్విట్టర్ ఖాతాలకు ఆమె జత చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ ట్వీట్ ను సీరియస్ గా తీసుకున్న ఎయిరిండియా భారీ జరిమానా విధించినట్లు పేర్కొంది.