మోడీపై ఈసీ అవాజ్యప్రేమ.. ఇంత దారుణమా?

Update: 2019-05-08 06:23 GMT
అధికారంలో ఉన్న వాళ్లకు వ్యవస్థులు గులాంలు అని మరోసారి నిరూపితమైంది.. అధికారంలో ఉన్న వాళ్లు తమకు అనుకూలమైన వారినే స్వతంత్ర వ్యవస్థల్లో నియమిస్తారు.. తానా అంటే తందానా అనమంటారు.. ఇప్పుడు దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ సర్వ సంతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ప్రధాని మోడీకి వంతపాడడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

శనివారం యూపీలోని ప్రతాప్ ఘడ్ లో మోడీ.. రాహుల్ ను టార్గెట్ చేసి ఆయన తండ్రి రాజీవ్ గాంధీపై వ్యక్తిగత దారుణ దూషణలకు దిగారు. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేవారు. మోడీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాహుల్ సైతం మోడీ కర్మఫలం అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ పై విమర్శలు చేసిన మోడీపై ప్రియాంక సైతం ఫైర్ అయ్యింది. దుర్యోధనుడిలాగానే మోడీకి గర్వభంగం తప్పదని విమర్శించింది.

ఇక రాజీవ్ గాంధీ అవినీతి పరుడంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై విచారించిన ఎన్నికల సంఘం శరామామూలుగానే మోడీ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఏ నియమాలను మోడీ ఉల్లంఘించలేదని అభిప్రాయపడింది. ఈ కారణంగానే మోడీపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.  ఇలా మోడీకి వరుసగా తొమ్మిదో సారి ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం.

కాగా మోడీ కోడ్ ఉల్లంఘిస్తున్నా కారణాలు చూపకుండానే ఎన్నికల సంఘం ఏకపక్షంగా క్లీన్ చిట్ లు ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ ఎంపీ సుస్మితా దేవ్ మోడీ కోడ్ ఉల్లంఘనల కాపీలు, ఈసీ ఉపేక్షించిన ఆర్డర్ లు జత చేసి పిటీషన్ వేశారు. చట్టాన్ని అతిక్రమించి ఈసీ నిర్నయాలు తీసుకుంటోందని ఫిర్యాదు చేశారు. అయినా కూడా మరోసారి ఈసీ మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం.

   

Tags:    

Similar News