ఒడిషాలో కోడ్ ఎత్తేశారు..కారణమిదే?

Update: 2019-05-01 08:19 GMT
ఎన్నికల కోడ్.. ఒక్కసారి అది వచ్చిదంటే మళ్లీ ఫలితాల తర్వాతే విడుదల. అప్పటి వరకు సంక్షేమ పథకాలకు చెక్..  ఏ పథకాన్ని ప్రారంభించడానికి, అమలు చేయడానికి వీల్లేదు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు డమ్మీలైపోతారు. అధికారం అంతా ఈసీదే.. అంతటి పవర్ ఫుల్ ఎన్నికల కోడ్ ను కూడా తాజాగా ఎత్తేశారు.అది విపత్కర పరిస్థితి ఎదురు కావడంతోనే..

బంగాళాఖాతంలో ఫాని తుఫాన్ దూసుకువస్తోంది. ప్రస్తుతం ఒడిషాలోని పూరికి 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.  తుఫాన్ మే 3న పారాదీప్ సమీపంలో తీరం దాటే వీలుంటుందని అంచనావేస్తున్నారు. ఒడిషా అతలాకుతలం అయ్యేలా ఉంది. ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రభుత్వానికి చేతులు కట్టేసినట్టుగా ఉంది. దీంతో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీకి వెళ్లి ఫోనీ తుఫాన్ తీవ్రత గురించి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఒడిషాలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని నవీన్ పట్నాయక్ ఈసీని కోరాడు. దీంతో ఈసీ కూడా ఒడిషాలో సహాయక చర్యలకు వీలుగా  కోడ్ ఎత్తివేయాలని డిసైడ్ అయ్యింది.

ఉహించని ముప్పు, తుఫానుగా మారిన పోనీ తీవ్రతను అంచనావేసిన ఈసీ వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా కోడ్ ఎత్తివేసింది. అయితే మే 19కు వాయిదా పడ్డ పాట్ కుర అసెంబ్లీ ఎన్నికను కూడా వాయిదా వేయాలని నవీన్ పట్నాయక్ కోరారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

దేశంలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయ్యింది. ఇంకా మూడు విడుతలు మిగిలి ఉన్నాయి.  ఫలితాల వెల్లడి వరకు కూడా కోడ్ ఎత్తివేయడానికి వీల్లేదు. కానీ ఒడిషాలో కోడ్ ఎత్తివేయడం విశేషం. అదే పక్కనున్న ఏపీలో తుఫాన్ ప్రభావం ఉన్నా కూడా కోడ్ ఎత్తివేయకపోవడం విశేషం.
Tags:    

Similar News