తెలుగు పార్టీలకు నిరాశ మిగిలింది

Update: 2015-09-09 10:07 GMT
కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలుగు పార్టీల‌కు చేదు క‌బురు అందించింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌తోనే వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక ఉంటుంద‌ని భావించిన పార్టీల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. తాజాగా బిహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి న‌సీం జైదీ ప్ర‌క‌టించారు. ఐదు ద‌ఫాల్లో బిహార్‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. అక్టోబ‌ర్ 14 తొలి విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు వివ‌రించారు. 243 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌త్యేకంగా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటుచేసిన నేప‌థ్యంలో తెలంగాణ‌లో కూడా ఉప ఎన్నిక‌లు ఉంటాయ‌ని భావించారు. ఉప ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో క‌డియం శ్రీ‌హ‌రి రాజీనామా చేసిన వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స్థానంలో ఉప ఎన్నిక త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ స్థానం నుంచి గెల‌వాల‌ని అధికార టీఆర్ ఎస్ పార్టీ స‌హా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ - టీడీపీ - బీజేపీ - వామ‌ప‌క్షాలు సైతం ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల త‌ర‌ఫున గ‌ద్ద‌ర్‌ ను ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా నిల‌పాల‌నే క‌స‌ర‌త్తు కూడా సాగుతోంది. బీజేపీ సైతం వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ఉత్సాహంతో అడుగులు వేస్తోంది.

దీంతోపాటు ఇటీవ‌లే మ‌ర‌ణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ప్రాతినిద్యం వ‌హించిన‌ నారాయ‌ణ్‌ ఖేడ్‌ కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అవుతుంద‌ని పార్టీలు భావించాయి. అయితే కేంద్రం విడుద‌ల చేసిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ లో వ‌రంగల్ స్థానం లేక‌పోవ‌డం, నారాయ‌ణ్ ఖేడ్ ప్ర‌స్తావ‌న రాక‌పోవ‌డం రాజ‌కీయ పార్టీల ఉత్సాహం నీళ్లు చ‌ల్లిన‌ట్లు అయింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌రోక్షంగా మొద‌లుపెట్టిన తెలుగు పార్టీలు తాజాగా ఆ వేగాన్ని ఎలా కొన‌సాగిస్తాయో చూడాలి మ‌రి.
Tags:    

Similar News