ఎన్నికల్ని బంతాట ఆడుకున్న కేసీఆర్ కు ఇప్పుడు ‘ఫియర్’?
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు ఏదైతే బలంగా ఉంటుంది.. కాలక్రమంలో అదే బలహీనతగా మారుతుంది. దీన్ని గుర్తించకుండా ఉంటే ఎదురయ్యే నష్టంఅంతా ఇంతా కాదు. సెంటిమెంట్ రాజకీయాలకు.. భావోద్వేగాలతో ఎన్నికల ఫలితాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో తెలుగురాష్ట్రాల్లో గులాబీ బాస్ కేసీఆర్ కు మించినోళ్లు కనిపించరు.
ఉద్యమం ఏదైనా.. అదెంతటి బలమైనది అయినా సరే అధికరంతో తొక్కేసే తీరును సవాలు చేయటమే కాదు.. తనకు అనుకూలంగా మార్చుకుంటూ తన డిమాండ్ ను రియాలిటీలోకి తీసుకురావటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి క్లిష్టమైన పనిని సాధించి.. అధికార పగ్గాలు చేపట్టారు కేసీఆర్.
పవర్ చేతిలో లేనప్పుడే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికలు ఏవైనా సరే.. బంతాట ఆడుకున్న గులాబీ బాస్ కు గడిచిన కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
మరింత సరిగ్గా చెప్పాలంటే.. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి ఆయన తిరోగమనం మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఊహించని షాకిచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినా.. అందుకు ఎన్ని ఎత్తులు వేయాల్సి వచ్చిందో.. మరెంత ఖర్చు చేయాల్సిన వచ్చిందో అందరికి తెలిసిన విషయమే.
కోరి తలనొప్పుల్ని తెచ్చుకోవటం అలవాటుగామారిన కేసీఆర్.. మితిమీరిన ఆత్మవిశ్వసంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లుగా చెప్పాలి. ఈటల ఎపిసోడ్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక రెండూ కూడా ఆయన చేతులారా చేసుకున్నవే తప్పించి ఇంకేమీ కావు. ఇకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేదని.. ఛాతీ విరుచుకొని మరీ ధీమాగా చెప్పుకున్న గులాబీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఫలితం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే.. వచ్చి పడిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ కు అగ్నిపరీక్షగా మారాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితిపై ఎవరూ స్పందించటానికి ఇష్టపడటం లేదు. అధికార పక్షంగా తమకున్న బలం.. బలగంతో స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల్ని సొంతం చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదు. దీనికికారణం.. ఓటర్లలో 70 శాతం మంది టీఆర్ఎస్ కు చెందిన వారే.
కాకుంటే.. స్థానిక సంస్థల్ని నిర్లక్ష్యం చేస్తూ.. వారి డిమాండ్లను లైట్ తీసుకున్న కేసీఆర్ సర్కారుపై వారంతా గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఈటల ఎపిసోడ్ ఒకటి అదనమైంది. ఎంపీటీసీలు.. జెడ్పీటీసీలుగా గెలిచిన వారిని కేసీఆర్ పట్టించుకోకపోవటం.. స్థానిక సంస్థల్ని బలపరిచే విషయంలో భారీ స్పీచులు ఇచ్చే కేసీఆర్.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే.
దీంతో.. స్థానిక సంస్థల సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్న వారి తీరును తెలుసుకున్న సీఎం కేసీఆర్.. జిల్లా.. మండల పరిషత్ అభివృద్ధికి తక్షణమే రూ.250 కోట్లు విడుదల చేయాలని పంచాయితీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను ఆదేశించినట్లుగా చెబుతున్నారు.
ఇదంతా చూస్తే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేసీఆర్ భయంగా ఉన్నట్లు చెప్పాలి. ఈ మధ్యన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఎన్నో ఎన్నికల్ని ఎదుర్కొన్నామని.. గెలుపోటములు తమకు కొత్తకాదని చెప్పటం ఒక ఎత్తు అయితే.. ‘పోతే ఒకట్రెండు స్థానాలు పోతాయ్.
దాన్నేమీ పట్టించుకోము’ అంటూ అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యల్ని వింటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న దానిపై ఆయనకు కాస్తంత క్లారిటీతో ఉన్నారని చెప్పక తప్పదు. ఏమైనా.. ఒకప్పుడు ఎన్నికల్ని బంతాట ఆడుకున్న ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా భయపడే పరిస్థితికి రావటం కాలవైచిత్రి కంటే కూడా.. తన చేతులారా చేసుకున్నదేనని చెప్పక తప్పదు.