సోషల్ మీడియా ప్రచారాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు అనుభవం ఉన్న వ్యక్తి కావాలి...ఇది ప్రపంచంలోని ప్రధాన పత్రికల్లో కనిపిస్తున్న యాడ్. మీరు కూడా ఈ ఉద్యోగానికి ఒక రాయి వేసి ట్రై చేయొచ్చు. వస్తే రాజభోగమే లేదంటే ఓ అప్లికేషన్ ఖర్చు పోయిందని సంతృప్తి చెందండి. ఇంతకీ ఏంటి ఆ యాడ్? ఎక్కడ ఆ జాబ్..? అంటారా చదవండి మరి.
స్వతహాగా టెక్కీ అయిన బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ రేపటితో 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. అయితే ఆ గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని బకింగ్ హమ్ ప్యాలెస్ భావిస్తోంది. విక్టోరియా రాణి గురించి వారి చరిత్ర గురించి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పేందుకు, నిరంతరం మానిటరింగ్ చేసేందుకు అనుభవజ్ఞుడైన ఓ వ్యక్తి కావాలంటూ పేపర్ లో రాయల్ ప్యాలెస్ ఒక ప్రకటన ఇచ్చింది. ఒక వేళ సెలెక్ట్ అయితే మీ పంట పండినట్టే.
మీరు చేయాల్సిందల్లా అక్కడే ఉన్న డిజిటల్ టీమ్ ను కోఆర్డినేట్ చేస్తూ, మీ క్రియేటివిటీని ఉపయోగించి ప్రపంచ దృష్టిని రాణి బర్త్ డే వేడుకలవైపు మళ్లించడమే. ఇప్పటికే రాణి గురించి యూట్యూబ్ లో - ట్విట్టర్ లో పలు కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇక మిగతా సామాజిక వెబ్ సైట్లలో ఈ కథనాలే టెలికాస్ట్ కావాలని రాయల్ ప్యాలెస్ ఆదేశించింది.
ఈ జాబ్ కు సెలెక్ట్ అయిన వ్యక్తికి దాదాపు కోటి రూపాయలు వేతనంగా ఇవ్వనున్నట్లు బకింగ్ హమ్ వర్గాలు తెలిపాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు సోషల్ మీడియా పై పట్టు ఉంటే ఓ రాయి వేసి చూడండి.