స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా అయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. తాజాగా మరోసారి అయన పేరు సంచలనంగా మారింది. దీనికి ప్రధాన కారణం అయన డేటా ట్రాన్స్‌ఫర్ చేసిన కీలక వ్యాఖ్యలే. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ కాంతి వేగంతో డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు . ప్రస్తుతం, స్టార్ లింక్ నెట్ వర్క్ డిష్, ఉపగ్రహాలు , గ్రౌండ్ స్టేషన్ లపై ఆధారపడుతుందని గిజ్మోచినా నివేదించింది.
ఉపగ్రహాలతో కమ్యూనికేట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నందున వేగవంతమైన డేటా బదిలీని కష్టతరం చేస్తున్న ఈ గ్రౌండ్ స్టేషన్లను వదిలించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. లేజర్ ప్రసార వేగం, మస్క్ చెప్పినట్లుగా, ఆప్టికల్ ఫైబర్ కంటే 40 శాతం వేగంగా ఉంటుందని అంచనా. ఫలితంగా, భూమిని తాకాల్సిన అవసరం లేకుండా మనం వేగంగా ఇంటర్నెట్ బదిలీ సామర్థ్యాలను చూడవచ్చు. మస్క్ , ప్రకటనను పరిగణనలోకి తీసుకొని, ఆప్టికల్ ఫైబర్ తో పాటు ప్రస్తుత వేగం ఆధారంగా వేగాన్ని లెక్కిస్తే, స్టార్ లింక్ డేటా ప్యాకెట్ లను సెకనుకు 180,832 మైళ్ల వేగంతో బదిలీ చేయగలదు. దీని వేగం కాంతి వేగంలో 97 శాతం ఉందని తెలిపారు.
దీనితో స్టార్ లింక్ అతి త్వరలో గ్రౌండ్ స్టేషన్ తీసివేసి, తగినంత బ్యాండ్ విడ్త్ ని అందిస్తుందని మస్క్ పేర్కొన్నారు. ఇటీవల మస్క్ ట్విట్టర్ లో తన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ త్వరలో స్టార్ లింక్ ను భారతదేశంలో విడుదల చేయవచ్చని చెప్పారు. దీని కోసం దేశంలో రెగ్యులేటరీ ఆమోదం ప్రక్రియ ఎలా పని చేస్తుందో కంపెనీ అన్వేషిస్తోందని మస్క్ ట్విట్టర్ పోస్ట్ పై స్పందించారు. స్టార్ లింక్ ఇటీవల 100,000 టెర్మినల్‌లను వినియోగదారులకు పంపింది. ఉపగ్రహాల క్లస్టర్ ద్వారా గ్లోబల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది సక్సెస్ అయితే డేటా ట్రాన్స్ ఫర్ కష్టాలు తీరినట్లే. ఇకపోతే , ఈయన ఈ ఏడాది మొదట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో టెస్లా, స్పెస్‌ఎక్స్ కంపెనీలకు ఈసీవో అయిన ఎలాన్ మస్క్ గంటకి ఏకంగా రూ.127 కోట్లు ఆదాయం ఆర్జించాడు.