ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం ‘టెస్లా’ అధినేత ఎలన్ మస్క్ కెపాసిటీ ఏంటన్నది అందరికీ తెలిసిందే. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతను మూడో అత్యధిక ధనవంతుడు. కొంత కాలంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాయి. సరికొత్త లక్ష్యానికి బాటలు పరుస్తున్నాయి. దాదాపుగా ఈ భూమ్మీదున్న ధనవంతులంతా ఒకే లక్ష్యంతో పని చేస్తుంటారు. తమకున్న ఆస్తులను ఎంత పెరిగితే.. అంతగా పెంచుకుంటూ పోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ.. మస్క్ మాత్రం వారికి భిన్నంగా.. తనకున్న ఆస్తులను అమ్మేసుకుంటూ వెళ్తున్నారు!
కొంత కాలంగా తనకు ఉన్న ఇళ్లను అమ్మేస్తూ వస్తున్న మస్క్ కు.. ప్రస్తుతం ఒకే ఒక సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు దాన్ని కూడా అమ్మేయబోతున్నట్టు ప్రకటించారు. అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో ఆ ఇల్లు ఉంది. ఇప్పటి వరకు ఆ ఇంటిని ప్రైవేటు కార్యక్రమాలకు అద్దెకు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు.. ఉన్న ఈ ఒక్క ఇంటిని కూడా అమ్మేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నాడో కూడా వెల్లడించారు మస్క్. తన జీవన విధానాన్ని పర్యావరణ హితంగా మలుచుకునే కార్యక్రమంలో భాగంగానే ఇలా చేస్తున్నట్టు చెప్పారు. తన అవసరాలను సాధ్యమైనంత మేర తగ్గించుకుంటున్నట్టు వెల్లడించారు. తన జీవితాన్ని పర్యావరణం కోసం, ఇతర గ్రహాల్లో మనుషులు కాలు పెట్టేందుకు చేసే పనుల కోసం అంకితం చేస్తానని ప్రకటించారు.
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్.. ఆ విధంగా కూడా కాలుష్య నివారణకు, తద్వారా పర్యావరణ హితానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో అంతరిక్ష ప్రయోగాలు కూడా చేపడుతున్నారు. ఇప్పుడు తన అవసరాలను తగ్గించుకుంటూ.. ఆస్తులను విక్రయిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.