కరోనా వేళ.. ప్రతి ఒక్కరు ఉంచుకోవాల్సిన నెంబర్లు ఇవే

Update: 2020-03-13 18:30 GMT
మనం బాగుంటే చాలన్న మాట చాలామంది నోటి నుంచి తరచూ వినిపిస్తోంది. కానీ.. కరోనా పుణ్యమా అని.. మన కంటే.. మన ఎదుటోడు బాగుండాలి. అంతకు మించి ఆరోగ్యంగా ఉండాలన్న మాట ఇప్పుడు తరచూ వినిపిస్తోంది. కంటికి కనిపించని వైరస్.. మనిషి ఆలోచనను పూర్తిగా మార్చేసిన పరిస్థితి. కరోనాను పిశాచితో పోలుస్తూ అప్పట్లో చైనా అధ్యక్షుడి మాటల్లోని తీవ్రతను చాలా దేశాలు అర్థం చేసుకోలేదు.

చాప కింద నీరులా పాకిన కరోనా.. తానేమిటన్నది విశ్వరూపం చూపిస్తున్న వేళ.. ప్రపంచ దేశాలు ఇప్పుడు అలెర్ట్ అయిపోయాయి. ఏ దేశానికి ఆ దేశం.. తమ దేశంలోకి మరెవరిని ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారత్ లోనూ ఇటీవలి రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి.

ఇటలీ.. ఇరాన్ లాంటి దేశాలతో పోలిస్తే.. భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందనే భావన గురువారం కాస్త డౌట్ పడేలా చేసింది. ఎందుకంటే.. ఒక్కరోజులోనే 15 పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి. దీంతో.. ఇప్పుడు కరోనా భయం అందరిని వెంటాడుతోంది. అవసరం అనుకుంటే తప్పించి బయట ప్రయాణాలు పెట్టుకోవద్దన్న మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా భారత్ లో 73 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటివేళ.. కరోనా మీద అవగాహన అంటే.. ఆందోళనే ఎక్కువగా వినిపిస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి.

కరోనా మీద సందేహాలు.. అనుమానాలు ఉన్న వారు.. సాయం అవసరమైన వారు ఈ హెల్ప్ లైన్లకు ఫోన్లు చేస్తే.. సాయం చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెంబర్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఎక్కడికి వెళతామన్నది చెప్పలేని వేళ.. ఫోన్లో.. కరోనా హెల్ప్ లైన్లకు సంబంధించిన సమాచారం వెంట ఉంచుకోవటం ఎందుకైనా మంచిది. ఆంధ్రప్రదేశ్ లో హెల్ప్ లైన్ నెంబరుగా 0866-2410978గా ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో 104నుఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లను చూస్తే..
Tags:    

Similar News