తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విషయంలోనూ కొత్త ప్రచారం సాగుతూ ఉంది. ఆయన కంపెనీల్లో పని చేసే కార్మికులు బాగా ఇబ్బందులు పడుతున్నట్టుగా - వారు తమ గోడును బయట వాళ్లతో వెల్లబోసుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది. గల్లా జయదేవ్ ఒక బడా వ్యాపారి అనే సంగతి వేరే చెప్పనక్కర్లేదు.
అత్యంత శ్రీమంతుడు అయిన ఎంపీల్లో గల్లా కూడా ఒకరు. పెద్ద వ్యాపారి కావడంతో.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటూ ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జయదేవ్ గుంటూరు ప్రాంతంలో పెద్దగా అవకాశాలు కల్పించింది ఏమీ లేదు.
అయితే స్వల్ప మెజారిటీతో రెండో సారి ఎన్నికల్లో నెగ్గుకు వచ్చారీయన. ఈయన విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలే అసహనంతో ఉన్నారు. ఎమ్మెల్యే ఓటును ఎవరికైనా వేసుకోవాలని - ఎంపీ ఓటును మాత్రం తనకే వేయాలంటూ గల్లా జయదేవ్ ప్రచారం చేశారని ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. గల్లా జయదేవ్ వ్యాపార పరిశ్రమల్లోని ఉద్యోగులు - కార్మికులు కూడా ఇప్పుడు అలానే వాపోతున్నారట. తమకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం - పని చేయించుకుంటూ తమను పిప్పి చేస్తున్న వైనం పై వారు అసహనంతో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వారు తమ పరిస్థితిని బయటి వారితో వెల్లబోసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఒకరకంగా జయదేవ్ కంపెనీల్లో శ్రమ దోపిడీ జరుగుతూ ఉందని - తాము అష్టకష్టాలపాలవుతున్నట్టుగా జయదేవ్ కంపెనీల్లో పని చేసే శ్రామికులు వాపోతూ ఉన్నారని సమాచారం. ఎంపీ హోదాలో ఉండి.. పార్లమెంట్ లో శుద్దులు చెప్పే జయదేవ్ కు సొంత పరిశ్రమల్లోని కార్మికులు పట్టారా? వారి పరిస్థితులు పట్టవా? అని ఆ కార్మికులే ప్రశ్నిస్తూ ఉన్నారట. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్ కంపెనీల్లో పని చేసే కార్మికుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.