హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ ముజఫర్ వానీని తీవ్రవాదులు పెద్ద హీరోగా అభివర్ణిస్తున్న వైనం తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరవడమే ఇందుకు నిదర్శనం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బుర్హాన్ పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులకు ధైర్యం నూరిపోసి ఉగ్రవాదం వైపు నడిపించాడన్న కథనాలు వెలువడ్డాయి. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అతడిని ఓ పోరాట యోధుడిగా చెప్పుకొచ్చాడు. అయితే అదంతా అబద్దమేనట. బుర్హాన్ వానీ పిరికిపంద అని తేలిపోయింది.
ఈ నెల 8న జమ్ము కాశ్మీర్ లోని అనంతనాగ్ ప్రాంతంలో తలదాచుకున్న అతడి స్థావరాన్ని భారత సైనికులు చుట్టుముట్టగానే అతడు బెంబేలెత్తిపోయాడట. భారత సైనికుల బూట్ల చప్పుడు వినిపించగానే అతడు ప్రాణభయంతో వణికిపోయాడట. మరో ఇద్దరు ఉగ్రవాదులతో కలసి ఆ స్థావరంలో దాక్కున్న బుర్హాన్ వానీ సైన్యం చేతిలో తనకు చావు తప్పదని తెలుసుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదించాడట. అయితే, అప్పటికే అతడు సాగించిన ఉగ్రవాద కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకున్న సైనికులు బుర్హాన్ సహా ముగ్గురు ఉగ్రవాదులను నాలుగంటే నాలుగు నిమిషాల్లో మట్టుబెట్టేశారట. డిఫెన్స్ న్యూస్ వెబ్ సైట్ ఈ ఆసక్తికర విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.