ఇంటర్నేషనల్ క్రికెట్ లో థౌజండ్ వాలా..ఇంగ్లండ్
క్రికెట్ పురుడు పోసుకున్న దేశం ఇంగ్లండ్ ఆ ఆటలో సరికొత్త రికార్డు సృష్టించింది. సుమారు నూటయాభయ్యేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంకే జట్టుకీ సాధ్యం కాని అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏకంగా వెయ్యి టెస్టు మ్యాచ్ లు ఆడి రికార్డు నెలకొల్పింది. బర్మింగ్ హామ్ వేదికగా టీమిండియాతో ప్రారంభమైన తొలిటెస్ట్ మ్యాచ్ తో ఇంగ్లండ్ ఈఘనతసాధించింది.
1877లో ఆస్ట్రేలియాతో తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది ఇంగ్లండ్. ఇప్పుడు వెయ్యో టెస్టు మ్యాచ్ ను భారత్ తో ఆడుతోంది. గత 141 సంవత్సరాల కాలంలో ఇంగ్లండ్ ఆడిన 999 టెస్ట్ మ్యాచ్ ల్లో 357 విజయాలు సాధించగా - 297 పరాజయాలు ఎదురయ్యాయి. ఇక 345 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
ఇంగ్లండ్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా 812 - వెస్టిండీస్ 635 మ్యాచ్ లు - టీమిండియా 523 టెస్టులు ఆడాయి. కాగా ఇంగ్లండ్ తానాడిన వెయ్యి టెస్టుల్లో తన చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతోనే 346 టెస్టులు ఆడింది. అందులో 108 విజయాలు సాధించింది. వెస్టిండీస్ తో 154 టెస్టులు ఆడి 48 విజయాలు - సౌతాఫ్రికాతో 149 టెస్టులు ఆడి 61 విజయాలు సాధించింది. టీమిండియా ప్రత్యర్థిగా 117 టెస్టు లు ఆడిన ఇంగ్లండ్ కు 43 విజయాలు - న్యూజిలాండ్ తో 103 మ్యాచ్ లు ఆడి 48 విజయాలు నమోదు చేసింది. పాకిస్థాన్ తో 83 టెస్టుల్లో 25 - శ్రీలంకతో 31 టెస్టుల్లో 12 విజయాలు - బంగ్లాదేశ్ తో 10 టెస్టుల్లో 9 విజయాలు - జింబాబ్వేతో 6 టెస్టుల్లో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.