దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దగ్ధం.. మరోవైపు దీపావళి బాణసంచాల పేలుళ్లు. ఇంకోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ - అన్ని కలిపి ఢిల్లీ కాలుష్యాన్ని ప్రమాద స్థాయికి చేర్చాయి.దీనితో ఢిల్లీ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. గతకొద్ది రోజులుగా కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
అధికారిక సమాచారం ప్రకారం.. ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే బాగుంది అని - 51-100 మధ్య ఉంటే సంతృప్తికరం అని - 101-200 మధ్య ఉండే మధ్యస్తం - 201-300 అయితే బాగోలేదు - 301-400 అయితే ఏమాత్రం బాగోలేదు - 401-500 మధ్య అయితే ప్రమాదకరం - 500పైన ఉంటే ప్రమాదకరం-ప్లస్ ఎమర్జెన్సీ గా చెప్తారు. దీనితో ప్రస్తుతం ఢిల్లీ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
అలాగే కాలుష్య స్ధాయి ప్రమాదకరంగా మారడంతో నవంబర్ 5 వరకూ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. మరోవైపు కాలుష్యం ఎమర్జెన్సీ దశకు చేరుకోవడంతో స్కూళ్లలో చిన్నారులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్రీతింగ్ మాస్క్ లను పంచారు. అలాగే నవంబరు 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఢిల్లీ లో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని.. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని - అందుకే ఈ ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నామని భురేలాల్ లేఖలో తెలిపారు. అలాగే ఇక వాహనాలకు సరి బేసి స్కీమ్ అమలు చేయడంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇకపోతే బొగ్గు - ఇతర ఇంధన ఆధారిత పరిశ్రమలను కూడా మూసివేయాలంటూ ఈపీసీఏ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ - హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.