పేద - మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్ తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన - వైద్య యంత్రాలు - బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్ సమకూర్చింది. ఈ భవనాన్ని శనివారం (09.01.2021) నాడు తెలంగాణ వైద్య - ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్ - ఎంఈఐఎల్ ఛైర్మన్ పిపి రెడ్డి - ఎంఈఐఎల్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఆయన ఎంఈఐఎల్ చేస్తున్న సేవలను కొనియాడారు. క్యాన్సర్ తో ఎంతోమంది బాధపడుతున్నారని వారందరికీ మేఘా సంస్థ భరోసా కల్పించిందన్నారు. లోక కళ్యాణం కోసం తనవంతు బాధ్యతగా ఈ సంస్థ ఆసుపత్రులకు సహాయం చేయడం సంతోషకరమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ బాధితుల కోసం కొన్ని కోట్లను ఖర్చు పెడుతోందని - అలాగే రాష్ట్రంలోని ఆసుపత్రులను ఆధునీకరించి వైద్యరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు.
నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే నిమ్స్ ఆసుపత్రికి భారీగా నిధులు కేటాయించి కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక టెక్నాలజీని - కాన్సర్ వార్డును పునర్ నిర్మించిన మేఘా చైర్మన్ - ఎండీ - డైరెక్టర్ లకు ధన్యవాదాలు తెలిపారు.
మేఘా ఇంజనీరింగ్ ఛైర్మన్ పిపి రెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యత లో మేఘా ఎప్పుడు ముందుంటుందని - కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా నిమ్స్ క్యాన్సర్ వార్డును నిర్మించామని తెలిపారు. అలాగే నిమ్స్ లోని ఆర్థోపెడిక్ విభాగాన్ని కూడా ఆధునీకరిస్తామని - దుర్గాబాయ్ దేశముఖ్ ఆసుపత్రి ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన - వైద్య యంత్రాలు - బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్ సమకూర్చింది. అధునీకరించిన 20,000 చదరపు అడుగుల వైశ్యాలంలో 50 బెడ్లతో పాటు ఆక్సిజన్ - వెంటిలేటర్లు - లిఫ్టు - సెంట్రలైజ్డ్ ఏసీ వంటి అత్యవసర సదుపాయాలన్నీ ఎంఈఐఎల్ సమకూర్చింది. అంతే కాదు గతంలో నిర్మించిన రెండవ అంతస్తు నిర్వహణ బాధ్యతలను కూడా గడిచిన మూడేళ్లుగా మేఘా నిర్వహిస్తోంది.
నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం భారీ నిధులతో ప్రత్యేక విభాగాన్ని 2018 సెప్టెంబర్ లోనే ప్రారంభించింది. ఈ అంకాలజీ భవనం ప్రారంభ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ - మొదటి అంతస్తులను పరిశీలించిన ఎంఈఐఎల్ ఛైర్మన్ శ్రీ. పి.పి.రెడ్డి - మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. పి. వి. కృష్ణారెడ్డి ఆ రెండింటిని పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలుపరుస్తూ కోట్ల రూపాయలతో అంకాలజీ విభాగంలోని గ్రౌండ్ మరియు మొదటి అంతస్థులను ఆధునిక సదుపాయాలతో పునర్ నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. నిమ్స్ అంకాలజీ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ - మొదటి అంతస్తులను రోగులు - సిబ్బంది అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించారు.
రాష్ట్రంలో క్యాన్సర్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2018లో 10 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో 18,000 చదరపు అడుగుల వైశ్యాల్యం లో నిమ్స్ లోని అంకాజీ నూతన భవనాన్ని నిర్మించింది. ఇందులో కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే సౌకర్యాలు కల్పించింది. 2018 సెప్టెంబర్ 23న నాటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి - మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు చేతుల మీదుగా ఈ విభాగం ప్రారంభమైంది.
ఇందులో పురుషుల వార్డుతో పాటు క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు మహిళలు ఉండటంతో వారికోసం ప్రత్యేకంగా ఫీమేల్ వార్డును - పిల్లల్లో సైతం క్యాన్సర్ వ్యాపిస్తుండటంతో వారికోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డు - రక్త క్యాన్సర్ బాధితులకు ప్రత్యేకంగా లుకేమియా వార్డును నిర్మించింది. రోగులకు అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేసిన 50 పడకలను ఈ వార్డుల్లో ఏర్పాటు చేశారు. ఐసీయూలో 5 బెడ్లు - పురుషుల వార్డులో 12 బెడ్లు - మహిళ వార్డులో 10 బెడ్లు - చిన్నపిల్లల వార్డులో 11 బెడ్లు - లుకేమియా వార్డులో 12 బెడ్లను ఏర్పాటు చేసింది. ప్రతి బెడ్ కు ప్రత్యేకంగా నాలుగువైపులా కర్టెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వార్డు వద్ద రోగులకు నిరంతరం సహాయం అందించేందుకు నర్సుల కోసం ప్రత్యేకంగా నర్స్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు చికిత్సను అందించేందుకు ఉపయోగించే ఆంకాలజికల్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను కూడా ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. క్రిటికల్ కండీషన్ లో ఉన్న క్యాన్సర్ రోగులకు ఇన్ ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉండటం - సమయానికి తగిన మందులు అందించడం - అస్థిరంగా ఉండే రోగుల బ్లడ్ ప్రెషర్ ని నియంత్రించేందుకు ఈ ఐసీయూను వాడుతారు.
కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పటికే హైదరాబాద్ లోని నీలోఫర్ - ఉస్మానియా ఆస్పత్రులతో పాటు ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో అక్షయ పాత్ర పథకం కింద భోజన సదుపాయాలు నిర్విరామంగా అందిస్తోంది. నాణ్యమైన - రుచికరమైన భోజనాన్ని రోగులతోపాటు - వారి వెంట వచ్చేవారికి సైతం అందిస్తూ... ఆకలి తీరుస్తోంది. సిద్దిపేట - గజ్వేల్ లాంటి మార్కెట్ యార్డుల్లో పంటలు అమ్ముకోవడానికి వచ్చి ఆకలితో అలమటించే రైతులు - హమాలీలకు సైతం సద్దిమూట పథకం ద్వారా భోజనం అందిస్తోంది.