పరిహారం కోసం కేసీఆర్ స్పీడ్ చూశావా బాబు?
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షం... రెండు రాష్ట్రాలకు నష్టం వాటిల్లేలా చేసింది. అయితే.. వర్షాల కారణంగా జరిగిన నష్టం మీద ఏపీతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు వేగంగా అడుగులు వేస్తుందని చెప్పాలి. వర్షాల కారణంగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రమంత్రి వెంకయ్యను ఇప్పటికే కలిసిన మంత్రి కేటీఆర్.. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి.. తెలంగాణకు సాయం చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా.. కేవలం రోజుల వ్యవధిలో మరో బృందం ఢిల్లీకి వెళ్లి.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసింది. వర్షాల కారణంగా తెలంగాణకు జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికను అందజేసింది. వర్షాలు తెలంగాణకు చేసిన నష్టం రూ.2202 కోట్లుగా తేల్చిన ప్రభుత్వం.. సాధారణం కంటే 197 శాతం అధిక వర్షపాతం కురవటంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మొత్తం నష్టంలో హైదరాబాద్ మహానగరానికి జరిగిన నష్టమే ఎక్కువగా ఉందని కేంద్రానికి చెప్పింది. అతి భారీగా కురిసిన వర్షం కారణంగా ఒక్క హైదరాబాద్ కే రూ.1157 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్క చెప్పింది.
వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని విభాగాల వారీగా లెక్కలు తీసి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. సాయం అందించాల్సిందిగా కోరింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. అధికారులు ఇంత స్పీడ్ గా ఉంటే.. ఏపీ సర్కారులో ఇలాంటివి కనిపించటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా.. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం.. సాయం కోసం ఫాలో అప్ చేయటం లాంటివి పెద్దగా కనిపించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.
ఓపక్క తెలంగాణ సర్కారు రెట్టించిన ఉత్సాహంతో కేంద్ర సాయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే.. అందుకు భిన్నంగా ఏపీ సర్కారు నిర్లప్తతతో కూడిన వ్యవహార సరళి ప్రదర్శిస్తోంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో యాక్టివ్ గా ఉండే చంద్రబాబు తన జోరు తగ్గించటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/