పాలకులు ప్రధాన ఆదాయ వనరుగా మారిన మద్యం అమ్మకాల దూకుడు కొనసాగుతోంది. పన్నుల ఆదాయంతో పాటుగా ఎక్సైజ్ ఆదాయం అని ఇన్నిరోజులు భావించి భారీ రాబడులు ఊహించగా...అదికాస్త ఇపుడు ఊహించని రీతిలో రెవెన్యూ ఇస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అంకెలు ప్రభుత్వ ఉన్నత వర్గాలనే ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 14,161.07కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అంచనా వేశారు. అయితే ఇంతకుమించి ఆదాయం వచ్చినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రలో అంచనాలు మించి మద్యం అమ్మకాలు జరిగినట్లు చెప్తున్నారు. ఏకంగా ఆరునెలల కాలంలోనే అంచనా కంటే 20శాతం అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. ఇదే దూకుడు రాబోయే కాలానికి కూడా ఇదే రీతిలో ఉంటాయని పేర్కొంటున్నారు. గుడుంబా వంటి అక్రమమద్యాన్ని అరికట్టడం వల్లే ఇలా జరిగిందనేది అధికారుల మాట. దాదాపుగా ఇదే తరహా అమ్మకాలు దేశవ్యాప్తంగా కూడా జరగడం ఆసక్తికరం.