ఈటల సెంటిమెంట్ సక్సెస్.. ఎప్పటి లానే ఈసారీ విజయమే

Update: 2021-11-03 05:00 GMT
రాజకీయాల్లో సెంటిమెంట్ కు భారీ ప్రాధాన్యత ను ఇస్తారు. అందునా.. నేతలు తమకు పరీక్షా కాలం లాంటి పరిస్థితులు ఏర్పడిన వేళ.. తన సెంటిమెంట్ల ను గుర్తుకు తెచ్చుకొని మరీ పాటిస్తుంటారు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈటల రాజేందర్ గెలుపు వెనుక.. ఆయన ఫాలో అయ్యే సెంటిమెంట్ ఈ సారి సక్సెస్ అయ్యేలా చేసిందంటున్నారు.

దీంతో.. తాజాగా ఆయన కు లభించిన విజయం లో సెంటిమెంట్ కు వాటా ఉందన్న మాటను ఈటల ఫాలోయర్స్ చెబుతున్నారు. సుదీర్ఘ కాలం టీఆర్ఎస్ లో ఉండి.. సీఎం కేసీఆర్ కత్తి కట్టటం కారణం గా పార్టీ నుంచి బయట కు వచ్చేసిన ఈటల.. తన ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేయటం తో.. ఉప ఎన్నిక అని వార్యమైంది.

ఎన్నికల బరి లో ఎప్పుడు దిగినా.. ఈటల కు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. అదేమంటే.. ఆయన నియోజకవర్గం పరిధి లోని గోపాల్ పూర్ పంచాయితీ పరిధి బత్తినివాని పల్లి గ్రామం అంటే ఆయన కు ప్రత్యేకమైన సెంటిమెంట్. తాను బరి లోకి దిగే ప్రతి ఎన్నికల ప్రచారాన్ని ఈ గ్రామం నుంచే షురూ చేశారు. గ్రామం లోని ఆంజనేయస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆయన తన ప్రచారాన్ని స్టార్ట్ చేస్తారు.

ఈసారి కూడా తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్ట టానికి ముందు ఈ గుడి లో పూజలు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని పాదయాత్ర తో చేపట్టటం తెలిసిందే. పాదయాత్ర ప్రారంభం లో ఆంజనేయస్వామి ఆలయం లో పూజలు చేసిన అనంతరం తన యాత్ర ను షురూ చేశారు. హుజూరాబాద్ నియోజక వర్గానికి ఈశాన్యం లో ఉండే కమలాపూర్ మండలానికి చివర గా ఉండే ఈ బత్తినివాని పల్లి రెండు జిల్లాల కు.. రెండు నియోజక వర్గాలకు సరిహద్దు గా ఉండటం మరో ప్రత్యేకతగా చెబుతారు.
Tags:    

Similar News