వాస్తవం కళ్ల ముందు కదలాడుతున్న వేళ.. అదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. చిన్న విషయాలకు తెలంగాణ ప్రజలు చూపించే మక్కువ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ కు ఒళ్లు మండేలా చేసినట్లుంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రజల తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎంత చెప్పినా.. బాధ్యత లేకుండా వ్యవహరిస్తునన తీరుపై ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
పది రోజుల పాటు ఇళ్లల్లో ఉండిపోవాలని ఎంత చెబుతున్నా.. అదేమీ లేకుండా అదే పనిగా రోడ్ల మీదకు వస్తున్న జనాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని.. మీకు వారం రోజుల పని ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా? అని సూటిగా అడిగేశారు. జనతా కర్ఫ్యూ వేళ.. ప్రజలు చూపించిన స్ఫూర్తి అంతలోనే ఏమైందని ప్రశ్నించిన ఆయన.. కరోనా ప్రస్తుతం స్టేజ్ 2లోనే ఉందని.. స్టేజ్ 3కి రానివ్వొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా స్టేజ్ 2లోకి వెళ్లినా.. ఇప్పటివరకూ వేళ్ల మీద లెక్కపెట్టే కేసులు మాత్రమే పాజిటివ్ అయ్యాయి. ఒకవిధంగా చూస్తే.. కరోనా స్టేజ్ వన్ నుంచి టూలోకి అడుగు పెట్టినా.. అది ముదర్లేదన్న భావనలో ప్రజలు ఉన్నారు. కానీ.. ఆ విషయాన్ని సింఫుల్ గా తీసుకుంటే.. రానున్న రోజులు ఎంత దారుణంగా ఉంటాయన్న మాట ఈటెల నోట మొదటిసారి వచ్చిందనుకోవాలి. గతంలో ఎప్పుడూ కూడా ఆయన ఇంతలా ఫస్ట్రేట్ కాలేదేమో?
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమన్న విషయాన్ని చెబుతూ.. ఆ వైరస్ ఉన్నోళ్లు తమకు తెలీకుండానే వందల మందికి అంటించే ప్రమాదం ఉందని.. ఎవరూ బయటకు రావొద్దంటూ హెచ్చరించారు. ఇప్పటివరకూ తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ గుండెలు అదిరే మాటను చెప్పారు. తాము ఇప్పటికే 99 మంది అనుమానితుల్ని గుర్తించామని.. వారి శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందన్న విషయాన్ని చెప్పారు. ఒకవేళ.. ఫలితం రావాల్సిన వారిలో ఎంతమంది పాజిటివ్ అన్నది లెక్క తేలితే కానీ.. స్టేజ్ 2 ఎంత ముందుకు వెళ్లామన్న విషయంపై క్లారిటీ వస్తుందన్న విషయం ఈటెల మాటల్లోని అసలు అర్థంగా చెబుతున్నారు. ఆల్ ఈజ్ వెల్ అని ఇప్పటివరకూ అనుకునేది కాస్తా సరి కాదని.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న భావనలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయం మంత్రి ఈటెల మాటలు స్పష్టం చేస్తున్నట్లే.