హెల్మెట్ పెట్టుకొని ఉన్నా.. కొత్త రూల్ ప్రకారం ఫైన్ వేస్తారట.. ఎందుకంటే?

Update: 2020-08-02 05:50 GMT
టూవీలర్ మీద వెళుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే చాలు భేఫికర్ అన్నట్లుగా వెళ్లిపోవచ్చు. మరికొద్ది నెలల్లో అలాంటి అవకాశమే లేదంటున్నారు. హెల్మెట్ పెట్టుకొని వెళ్లే వారికి సైతం చలానాలు విధించే రోజు దగ్గర్లోనే ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొత్త రూల్ వచ్చే ఏడాది మార్చి నుంచి మొదలవుతున్నట్లు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయమండి.. హెల్మెట్ పెట్టుకుంటే ఫైన్ ఎలా వేస్తారు? అందుకు రూల్ ఎలా ఒప్పుకుంటుందన్న సందేహం రావొచ్చు.

ఇంతకీ అలా ఫైన్ వేసే కొత్త రూల్ లోని కీలకమైన పాయింట్.. నాణ్యమైన హెల్మెట్ వాడాల్సిన బాధ్యత వినియోగదారుల మీద ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా.. తక్కువ ధరకు లభించే హెల్మెట్లను కొనుగోలు చేసి.. వాటిని ధరిస్తే.. ఊరుకోరని చెబుతున్నారు. ప్రమాద సమయాల్లో నాణ్యమైన హెల్మెట్ పెట్టుకోకుంటే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు.. చాలా సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి. అందుకే.. నాణ్యమైన హెల్మెట్ వాడేందుకు వీలుగా కొత్త రూల్ ను తీసుకొస్తున్నారు.

బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సింఫుల్ గా చెప్పాలంటే బీఐఎస్ ప్రమాణాల మేరకు రూపొందించని హెల్మెట్ల మీద జరిమానాలు విధించేలా కొత్త రూల్ తీసుకొచ్చారు. ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి హెల్మెట్ మీద బీఐఎస్ మార్కు లేకుంటే పోలీసులకు చలానా విధించే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న హెల్మెట్ నాణ్యమైనదా? కాదా? అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి. అదే సమయంలో కొత్త హెల్మెట్ కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణంగా మారే బీఐఎస్ మార్కు ఉందా? లేదా? అన్నది చెక్ చేసుకొని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Tags:    

Similar News