అంతా నేను చెప్పినట్టే జరుగుతోందిః కేఏ పాల్‌

Update: 2021-06-27 11:47 GMT
ఈ ప్ర‌పంచంలో జ‌రుగుతున్న చాలా అంశాలు తాను ముందుగా చెప్పిన‌వేన‌ని, తాను చెప్పిన‌ట్టే అన్నీ జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, క్రైస్త‌వ మ‌త‌ప్ర‌బోధ‌కుడు కేఏ పాల్ అన్నారు. అమెరికా నుంచి మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. చైనాపై మండిప‌డ్డారు.

ఈ ప్ర‌పంచం ఇలా నాశ‌న‌మై పోవ‌డానికి చైనాయే కార‌ణ‌మ‌ని, క‌రోనా వైర‌స్ ను ఆ దేశమే తయారు చేసిందని పాల్ ఆరోపించారు. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నాశ‌న‌మైపోగా.. చైనా మాత్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ విప‌త్తు కార‌ణంగా.. అన్ని దేశాలూ క‌లిసి ట్రిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోయిన‌ట్టు చెప్పిన పాల్‌.. ప్ర‌పంచ దేశాల‌కు ఓ పిలుపునిచ్చారు. ప్ర‌పంచానికి ఇంత ఆర్థిక న‌ష్టం క‌లిగించినందుకుగానూ.. చైనా నుంచి తీసుకున్న అప్పులు ఎవ్వ‌రూ తిరిగి ఇవ్వొద్ద‌ని సూచించారు.

ప్ర‌పంచ దేశాల నుంచి ఇండియా, ఏపీ రాజ‌కీయాల వ‌ర‌కు చుట్టేసిన పాల్‌.. క‌రోనా నియంత్ర‌ణ‌లో మోడీ సర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని అన్నారు. కేంద్రం నిర్ల‌క్ష్యం కార‌ణంగానే వేలాది మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటు ఏపీలోనూ జ‌గ‌న్‌ స‌ర్కారు అన్నింటా విఫ‌ల‌మైంద‌ని అన్నారు.
Tags:    

Similar News