తిమ్మిని బమ్మిని చేయటంలో రియల్టర్లకు మించిన వారు ఉండరు. కళ్ల ముందు సినిమా లాంటి ఫ్యూచర్ చూపించి ఆస్తుల్ని అమ్మేయటంలో వారికి వారే సాటి. ఇళ్లు.. భూముల కొనుగోళ్లలో ఏ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఖరీదైన మూల్యానికి కారణం అవుతుందన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా తాజా ఉదంతం ఒకటి బయటకు వచ్చింది.
మాజీ పోలీస్ బాస్.. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసి రిటైర్ అయిన అరవింద్‌రావు.. తాజాగా ఒక భూ వివాదంలో చిక్కుకున్నారు. ఒక మాజీ ఐపీఎస్ నుంచి కొనుగోలు చేసిన భూమిలో ఆయన నిర్మాణం ప్రారంభించటం.. దీనిపై అక్కడి స్థాని సర్పంచ్.. గ్రామస్థులు అడ్డుచెప్పటంతో ఇప్పుడీ వివాదం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది.
రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట మండలంలోని ఒక స్థలాన్ని అరవింద్‌రావు కొనుగోలు చేశారు. ఇప్పుడా భూమిలో ఒక నిర్మాణం చేసేందుకు అరవింద్‌రావు ప్రయత్నించటం.. దాన్ని స్థానికులు అడ్డుకోవటం చర్చనీయాంశమైంది. తాను ఓ సీనియర్ అధికారి నుంచి కొనుగోలు చేసినట్లు అరవింద్‌రావు చెబుతూ.. భూమికి సంబంధించిన పత్రాలు చూపిస్తుంటే.. మరోవైపు సర్పంచ్.. స్థానికులు మాత్రం సదరు భూమి గ్రామంలోని ఆలయానికి సంబంధించిందని చెబుతున్నారు.
దీనిపై న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించిన నకళ్లను పోలీస్‌స్టేషన్లో ఇచ్చినట్లు చెబుతున్నారు. అరవింద్‌రావు తప్పు చేయనప్పటికీ.. ఆయన కొనుగోలు చేసిన సీనియర్ అధికారి మోసపోయి ఉండవచ్చని.. ఆయనకు భూమి అమ్మిన వారు బోల్తా కొట్టించి ఉంటారని.. ఆ విధంగా అరవిందరావు బుక్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి.. ఇప్పుడు పోలీసులు చివరకు ఏం చేస్తారో చూడాలి.