ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఎగ్జామ్ పేపర్ల లీక్ వ్యవహారంలో హడావుడిగా నారాయణ స్కూల్స్ అధినేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఆలస్యం చేయకుండా ఈ వ్యవహారంపై చిత్తూరు జిల్లా ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించేసింది. నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ చేశారని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లో తేల్చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై తాము జరిపిన విచారణలో భాగంగా నిందితుల లింక్‌లో నారాయణ సంస్థల అధినేత నారాయణ పేరు వచ్చిందని, ఈ మేరకు ఆధారాలు లభించాకే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్‌ను లీక్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. చిత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగానే నారాయణను అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
ఇంకా ఈ కేసు గురించి ఎస్పీ మాట్లాడుతూ.. నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ జరిగింది. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్ చేశారు. వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజిస్తారు. ముందే ఏ విద్యార్థులు ఎక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుంటారు. హెడ్ ఆఫీస్ నుంచి వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపుతారు.
నారాయణతో పాటు తిరుపతి డీన్ బాల గంగాధర్‌ను అరెస్ట్ చేశాం. నిందితుల వాంగ్మూలం, టెక్నికల్ ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేశాం. అరెస్ట్ అయిన వారంతా 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పని చేసిన వారే. గత నెల 27న వాట్సాప్‌లో లీకయినట్లు ఫిర్యాదు వచ్చింది. గతంలో కూడా ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నారాయణను కోర్టులో హాజరుపరుస్తాం'' అని తెలిపారు.
కాగా నారాయణ కంటే ముందు తిరుపతి నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆయన అప్రూవర్‌గా మారినట్లు, నారాయణ ప్రోద్బలంతోనే పేపర్ లీక్ చేసినట్లు పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గిరిధర్ వాంగ్మూలంతోనే పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లి, తన కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉన్న నారాయణను అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నాయి. ఐతే కొన్ని రోజుల ముందే అసలు పేపర్ లీకే జరగలేదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేయగా.. ఇప్పుడిలా పోలీసులేమో లీక్ చేయించింది నారాయణే అంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.