తిరుమలలో తప్పిపోయిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకి దొరికింది. తిరుపతికి 15కి.మీ దూరంలోని కరకంబాడీ సమీపంలో స్థానికులు ఆయన్ను గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం శనివారం సాయంత్రం తిరుమలలో తప్పిపోయినట్లు ఆయన సతీమణి కుంజా వెంకట రమణ తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వార్త మీడియాలో ప్రచారం కావడంతో కరకంబాడికి చెందిన పలువురు అక్కడ కనిపించిన కుంబా భిక్షంను గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కుటుంబ సభ్యులకు చేరవేశారు. దీంతో రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
కుంజా భిక్షం మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్లారు. శనివారం సాయంత్రం స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు వేసే సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగటంతో కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయారు. ఆయనకు కొంతకాలంగా మతిస్థిమితంగా ఉండడం లేదని సమాచారం. ఆయన వియ్యంకుడు ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర తిరుమలలో భిక్షం ఆచూకీ కోసం అన్వేషణ సాగించారు. ఈ క్రమంలో పోలీసులు ఆచూకి కొనసాగిస్తుండగా తాజాగా కరకం బాడి సమీపంలో దొరకడంతో ఇటు ఎమ్మెల్యే కుటుంబసభ్యులు - అటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/