టీడీపీ నేత - గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావుపై ఓ బాధితుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. ఆయన కబ్జా చేయిస్తున్నాడంటూ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ తనను హతమారుస్తానని బెదిరించి ఇల్లును వేరొకరికి రాయించాడని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన అనబోతుల గురవారెడ్డి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాను మిరపకాయల వ్యాపారం చేస్తుంటానని ఆ క్రమంలోనే నాలుగు వేల బస్తాల మిర్చీ పంటను బాలాజీ కోల్డ్ స్టోరేజీలో దాచానని గురవా రెడ్డి తెలిపాడు. ఈ పంట హామీతో బ్యాంకులో 1.10 కోట్లు అప్పుగా తీసుకున్నానని వివరించాడు. అయితే బ్యాంకు రుణం తీరుస్తామంటూ నా నాలుగు వేల మిర్చి పంట బస్తాను కోల్డ్ స్టోరేజీ యజమానులు రాయించుకొని తర్వాత బ్యాంకు కు డబ్బులు కట్టకుండా మోసం చేశారని గురవా రెడ్డి ఆరోపించాడు. బ్యాంకు మేనేజర్లు వచ్చి తమను కట్టాలని లేదంటే తమ భూమి, ఇళ్లు వేలం వేస్తామని బెదిరించారని ఆరోపించారు.
ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఎంట్రీ అయ్యి తనను బెదిరించి తన 70 లక్షల ఇంటిని వేరే వ్యక్తికి బలవంతంగా రాయించాడని గురవారెడ్డి ఆరోపించాడు. హతమారుస్తానని చెప్పడంతో రాసిచ్చానని వివరించాడు. ఇప్పుడు ఇంట్లోంచి గెంటివేశారని న్యాయం చేయాలని గురువారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.